iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: ఆసీస్ తో మ్యాచ్.. ఆ ప్లాన్ తోనే విజయం సాధించాం: సూర్య కుమార్

  • Author Soma Sekhar Updated - 03:23 PM, Sat - 2 December 23

ఆసీస్ తో 4వ టీ20 మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించామని, వాటిని పక్కాగా అమలు చేసి.. ఈ విజయం సాధించామని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.

ఆసీస్ తో 4వ టీ20 మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించామని, వాటిని పక్కాగా అమలు చేసి.. ఈ విజయం సాధించామని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.

  • Author Soma Sekhar Updated - 03:23 PM, Sat - 2 December 23
Suryakumar Yadav: ఆసీస్ తో మ్యాచ్.. ఆ ప్లాన్ తోనే విజయం సాధించాం: సూర్య కుమార్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. కీలకమైన నాలుగో మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో కంగారూలను కంగుతినిపించింది. గత మూడు మ్యాచ్ లకు భిన్నంగా ఈ పోరు సాగింది. అయితే ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించామని వాటిని పక్కాగా అమలు చేసి.. ఈ విజయం సాధించామని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. మరి భారత్ జట్టు సిరీస్ గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు పరిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో మ్యాచ్ ను గెలవడంతో పాటుగా సిరీస్ ను కూడా చేజిక్కించుకుని వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రతేకంగా కొన్ని ప్రణాళికలను అమలు చేశామని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ..”మా ప్లాన్ ప్రకారమే ఆడి ఈ మ్యాచ్ లో విజయం సాధించాం. డెత్ ఓవర్లలో యార్కర్లతో కట్టడి చేయాలని ముందే అనుకున్నాం. అలాగే చేశాం. ఇక ఈ పోరులో ఒక్క టాస్ తప్ప అన్నీ మేం అనుకున్నట్లుగానే జరిగాయి. ప్రతీ ఒక్క ప్లేయర్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. మ్యాచ్ కు ముందు నేను ఆటగాళ్లకు ఒక్కటే చెప్పా.. మీ సత్తాను భయపెడుతూ.. ఫియర్ లెస్ గా ఆడమని” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య కుమార్.

ఇక అక్షర్ పటేల్ ను ఎప్పుడు ఒత్తిడిలో ఉంచడానికే ఇష్టపడతానని తెలిపాడు. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటర్లను యార్కర్లతో కట్టడి చేయడం మా విజయానికి దోహదపడిందని వివరించాడు టీమిండియా కెప్టెన్. కాగా.. గత మ్యాచ్ లకు భిన్నంగా ఈ పోరు సాగింది. ఇంతకు ముందు మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తొలుత టీమిండియా ఓపెనర్ల బ్యాటింగ్ చూస్తే.. ఈ గేమ్ లో కూడా పరుగుల వరద పారుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వెంటవెంటనే వికెట్లు పడటం.. భారీ స్కోర్ కు బ్రేకులు వేసింది. అయినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కంగారూ టీమ్ పై విజయం సాధించింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.