Suryakumar Yadav: అందరి మెడలో ఒక్కటే మెడల్‌! కానీ, సూర్యకి మాత్రం రెండు ఎందుకు?

Suryakumar Yadav, IND vs SA, Final, Jay Shah: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత జట్టులోని ఆటగాళ్లందరికీ ఒక్కో మెడల్‌ ఇస్తే.. సూర్యకుమార్‌ యాదవ్‌కు రెండు మెడల్స్‌ దక్కాయి. మరి ఆ రెండో మెడల్‌ ఎందుకిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

Suryakumar Yadav, IND vs SA, Final, Jay Shah: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత జట్టులోని ఆటగాళ్లందరికీ ఒక్కో మెడల్‌ ఇస్తే.. సూర్యకుమార్‌ యాదవ్‌కు రెండు మెడల్స్‌ దక్కాయి. మరి ఆ రెండో మెడల్‌ ఎందుకిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం బార్బోడోస్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌ ఎక్కడ చేజారి పోతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టీవీల ముందు కూర్చున్న వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులను సంతోషంలో ముంచుతూ.. టీమిండియా విజయ తీరాలకు చేరింది. లేదు లేదు.. బౌలర్లు చేర్చారు. సౌతాఫ్రికా విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా, పాండ్యా, అర్షదీప్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. దాంతో విజయం మన వశమైంది. వరల్డ్‌ కప్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన టీమిండియా ప్లేయర్లకు ఐసీసీ మెడల్స్‌ను బహుకరించింది.

కానీ, టీమిండియా స్టార్‌ ప్లేయర్‌, మిస్టర​ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ మెడలో మాత్రం రెండు మెడల్స్‌ దర్శనమిచ్చాయి. అదేంటీ.. అందరికీ ఒక్కో మెడల్‌ ఇచ్చి సూర్యుకు మాత్రం రెండు మెడల్స్‌ ఎందుకు ఇచ్చారు అని క్రికెట్‌ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. అయితే.. ఆ రెండో మెడల్‌ ఐసీసీ ఇవ్వలేదు. బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు కింద భారత ఫీల్డింగ్‌ కోచ్‌ సూర్యను ఎంపిక చేయడంతో.. బీసీసీఐ కార్యదర్శి జైషా, సూర్యకు ఆ మెడల్‌ బహూకరించారు. మ్యాచ్‌ చివరి ఓవర్‌లో మిల్లర్‌ కొట్టిన అద్భుతమైన షాట్‌ను లాంగ్‌ ఆఫ్‌లో సూపర్‌ క్యాచ్‌ అందుకుని మ్యాచ్‌ సేవ్‌ చేసినందుకు గాను సూర్యకు ఈ మెడల్‌ లభించింది. ప్రతి మ్యాచ్‌లో బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు ఇచ్చే సాంప్రదాయాని గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023తో భారత కోచింగ్‌ స్టాఫ్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగుల మంచి స్కోర్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76, అక్షర్ పటేల్‌ 47, శివమ్‌ దూబే 27 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహరాజ్‌, నోర్జే రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్‌, రబాడ చెరో ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్వింటన్‌ డికాక్‌ 39, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 31, హెన్రిచ్‌ క్లాసెన్‌ 52, డేవిడ్‌ మిల్లర్‌ 21 పరుగులతో రాణించినా.. చివర్లో ఒత్తిడికి చిత్తయ్యారు. ఒకానొక దశలో క్లాసెన్‌ అయితే టీమిండియాకు ఓటమి లాంఛనం చేశాడు. కానీ, బుమ్రా, అర్షదీప్‌, పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సౌతాఫ్రికా తలొంచింది. భారత బౌలర్లలో అర్షదీప్‌ 2, బుమ్రా 2, పాండ్యా 3, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో సూర్య పట్టిన క్యాచ్‌తో పాటు అతనికి బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments