విధ్వంసకర సెంచరీతో సచిన్‌ను దాటి.. రోహిత్‌తో సమంగా నిలిచిన సూర్య!

Suryakumar Yadav, Rohit Sharma, Sachin Tendulkar: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అది కూడా సచిన్‌ టెండూల్కర్‌ను దాటేసి. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Suryakumar Yadav, Rohit Sharma, Sachin Tendulkar: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అది కూడా సచిన్‌ టెండూల్కర్‌ను దాటేసి. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. సోమవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 సూర్యకుమార్ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఫోర్లు సిక్సులతో విరుచుకుపడుతూ.. ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి ముంబై.. కేవలం 31 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైని.. ఒంటిచేత్తో గెలిపించాడు. తిలక్‌ వర్మతో కలిసి.. భారీ భాగస్వామ్యం నమోదు చేసి ఈ సీజన్‌లో ఎంఐకి నాలుగో విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అయితే.. ఈ మ్యాచ్‌లో బాదిన సెంచరీతో సూర్య భాయ్‌ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా దిగ్గజ క్రికెటర్‌, గాడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ అయిన సచిన్‌ టెండూల్కర్ రికార్డును బ్రేక్‌ చేసి.. మరో స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మతో సమంగా నిలిచాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటంటే.. ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌తో సమంగా నిలిచాడు. రోహిత్‌ శర్మకు ఐపీఎల్‌లో ముంబై తరఫున 2 సెంచరీలు ఉన్నాయి. అలాగే ఈ సెంచరీతో సూర్య కూడా రెండో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌కు ఒక సెంచరీ ఉంది. ఇప్పుడు సూర్య ఆ రికార్డును బ్రేక్‌ చేసి.. సచిన్‌ను దాటేశాడు. సచిన్‌తో పాటు సనత్‌ జయసూర్య, సిమన్స్‌, కామెరున్‌ గ్రీన్‌ సైతం ముంబై తరఫున సెంచరీలు బాదారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 48, నితీష్‌ రెడ్డి 20, కెప్టెన్‌ కమిన్స్‌ 35 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా, పీయూష్‌ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా, కంబోజ్‌ చెరో వికెట్‌ తీశారు. ఇక 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి.. మరో ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది. ఇషాన్‌ కిషన్‌ 9, రోహిత్‌ శర్మ 4, నమన్‌ ధీర్‌ 0 ఇలా వరుసగా పెవిలియన్‌ చేరారు. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మతో కలిసి 143 పరుగుల పార్ట్నర్‌షిప్‌ నమోదు చేసి.. ఎంఐని గెలిపించారు. సూర్య్ 102, తిలక్‌ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో సెంచరీతో సూర్య.. సచిన్‌ను దాటేసి, రోహిత్‌ శర్మతో సమంగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments