టాప్‌ 3 క్రికెట్లు వీళ్లే అంటూ ప్రకటించిన సురేష్‌ రైనా! అందులో ఇద్దరు..

Suresh Raina, Rohit Sharma: భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టాప్‌ 3 బ్యాటర్లు వీళ్లే అంటూ పేర్కొన్నాడు. మరి ఆ బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Suresh Raina, Rohit Sharma: భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టాప్‌ 3 బ్యాటర్లు వీళ్లే అంటూ పేర్కొన్నాడు. మరి ఆ బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత మాజీ క్రికెటర్లు ఆల్‌ టైమ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌, బెస్ట్‌ ప్లేయర్స్‌ అంటూ ఆసక్తికర స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఇటీవల ఆల్‌ టైమ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ అంటూ ఒక టీమ్‌ను ప్రకటించాడు. అందులో ధోని పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌ టాప్‌ 3 బెస్ట్‌ బ్యాటర్లు వీళ్లే అంటూ ఓ ముగ్గురు క్రికెటర్ల పేర్లు ప్రకటించాడు. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సురేష్‌ రైనా.. ఇండియన్‌ క్రికెటర్‌లో మంచి రికార్డులు ఉన్న క్రికెటర్‌. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొట్టమొదటి ఇండియన్‌ క్రికెటర్‌ అతనే. అయితే.. తాజాగా రైనా ఓ ముగ్గురు క్రికెటర్లను వరల్డ్‌లోనే టాప్‌ 3 బ్యాటర్లుగా పేర్కొన్నాడు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జో రూట్‌. వీళ్లు ముగ్గురు ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమై బ్యాటర్లంటూ ప్రకటించాడు. ఈ ప్రకటనతో కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఏకీభవిస్తుంటే.. మరి కొంతమంది విభేదిస్తున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను టాప్‌ 3లో పేర్కొనడాన్ని సమర్థిస్తూ.. జో రూట్‌ ఎంపికపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జో రూట్‌ కంటే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను టాప్‌ 3లో ఒకడిగా పేర్కొంటే బాగుండేదని అంటున్నారు. అయితే.. చాలా మంది క్రికెట్‌ నిపుణులు విరాట్‌ కోహ్లీ, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌లను ఫ్యాబ్‌ ఫోర్‌గా చెబుతుంటారు. కానీ, సురేష్‌ రైనా మాత్రం ఆశ్చర్యకరంగా టాప్‌ 3ని లెక్కలోని తీసుకున్నాడు. అయితే.. సురేష్‌ ఎంపికలో ఎలాంటి తప్పులేదని.. అతను కరెక్ట్‌గానే ఎంపిక చేశాడంటూ సమర్థిస్తున్నారు. రోహిత్‌ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్లేయర్‌ అని, ప్రపంచంలో ఎవరు టాప్‌ 3ని ఎంచుకున్న అందులో కోహ్లీ పేరు ఉంటుందని, ఇక జో రూట్‌ కూడా టాప్‌ 3లో ఉండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు. మరి సురేష్‌ రైనా ఈ ముగ్గురి టాప్‌ 3గా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments