SNP
Suresh Raina, IND vs SA, T20 World Cup 2010: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. తన ప్రైమ్ టైమ్‌తో సృష్టించిన విధ్వంస.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని ఓ రోజుగా మారిపోయింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Suresh Raina, IND vs SA, T20 World Cup 2010: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. తన ప్రైమ్ టైమ్‌తో సృష్టించిన విధ్వంస.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని ఓ రోజుగా మారిపోయింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
సురేష్ రైనా అంటే చాలా మందికి టీమిండియా మాజీ క్రికెటర్‌గా, చెన్నై సూపర్ కింగ్స్‌లో చిన్న తలాగా మాత్రమే తెలుసు. కానీ, ఇండియన్ క్రికెట్‌లో రావాల్సినంత గుర్తింపు రాని ఓ లెజెండరీ క్రికెటర్ అని చాలా తక్కువ మందికే తెలుసు. అయితే.. అలాంటి అన్‌సంగ్ హీరో ఓ సారి రాక్షసుడిలా మారి.. పటిష్టమైన సౌతాఫ్రికా టీమ్‌పై విధ్వంసం సృష్టించాడు. ఆ రోజు రైనా ఆట.. ఇండియన్ క్రికెట్‌లో నూతన అధ్యాయంగా నిలిచిపోయింది. భారత క్రికెట్‌లో చరిత్రలో మర్చిపోలేని రోజుగా మారిపోయింది. నేటికి సరిగ్గా.. 14 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ 2010లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సురేష్ రైనా ఏకంగా సెంచరీతో చెలరేగాడు. భారత క్రికెట్ చరిత్రలో టీ20ల్లో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్‌గా సురేష్ రైనా చరిత్ర సృష్టించాడు.
ఎంతో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా కేవలం నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోతుంది. ఓపెనర్ మురళీ విజయ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం టీమిండియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలవుతాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ దినేష్ కార్తీక్ సైతం 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవుతాడు. ఇలా టీమిండియా 6 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసి.. రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడుతుంది. ఇలాంటి టైమ్‌లో టీమిండియాను ఒంటి చేత్తో ఆదుకున్నాడు సురేష్ రైనా.. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఆల్బీ మోర్కెల్, జాక్వెస్ కలిస్ లాంటి హేమాహేమీ బౌలర్లను ఎదుర్కొంటూ.. 60 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సులతో విధ్వంకర ఇన్నింగ్స్ ఆడి.. అప్పటి వరకు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎవరూ సాధించలేకపోయినా.. టీ20 సెంచరీని రైనా సాధించాడు.
అది కూడా టీ20 వరల్డ్ కప్ స్టేజ్‌పై. అందులోనా.. సౌతాఫ్రికా లాంటి వరల్డ్స్ బెస్ట్ బౌలింగ్ ఎటాక్ ఉన్న టీమ్‌పై టీ20 సెంచరీ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడంటే.. ఫ్లాట్ వికెట్లపై బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు కానీ, రైనా సృష్టించిన విధ్వంసం ముందు ఇవన్నీ నథింగ్ అంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో రైనా దెబ్బతో టీమిండియా 20 ఓవర్లలో 186 పరుగులు చేసి.. సౌతాఫ్రికాను 172 పరుగులకే కట్టడి చేసి.. 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో టీమిండియా తరఫున తొలి సెంచరీ రికార్డే కాదు.. మూడు ఫార్మాట్లలో అంటే.. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా సురేష్ రైనా పేరిట అద్భుతమైన రికార్డ్ ఉంది. ఇలా ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ డేగా నిలిచిపోయేలా మే 2ను తన పేరిట లిఖించుకున్నాడు రైనా. మరి రైనా ఆడిన ఇన్నింగ్స్‌తో పాటే, అతని రికార్డుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A HISTORIC DAY IN INDIAN T20I CRICKET. 🌟
– Suresh Raina becomes the first Indian to score a T20I hundred “OTD in 2010”, he scored a terrific hundred against South Africa in the World Cup. 🫡 pic.twitter.com/lhPVZb7Czg
— Johns. (@CricCrazyJohns) May 2, 2024