SNP
SNP
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ముందు ఇప్పుడున్న ప్రధాన టార్గెట్ వన్డే వరల్డ్ కప్ గెలవడం. 2011లో గెలిచిన వరల్డ్ కప్ టీమ్‌లో కోహ్లీ భాగమైనప్పటికీ.. ఈ వరల్డ్ కప్‌ను గెలవడం కూడా కోహ్లీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రస్తుతం కోహ్లీ ఫోకస్ మొత్తం.. ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023పైనే ఉంది. దాని కోసమే సంసిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ అండ్ వరల్డ్ కప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటంటే.. ఈ వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ ఖరీదైన డైమండ్ పొదిగిన బ్యాట్‌తో ఆడుతాడంటా.
సూరత్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఉత్పల్ మిస్త్రీ కోహ్లికి 1.04 క్యారెట్ల వజ్రాలు పొదిగిన బ్యాట్‌ను బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ బ్యాట్‌తోనే కోహ్లీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలని అతని కోరిక. ఈ డైమండ్ బ్యాట్‌ను సిద్ధం చేయడానికి ఒక నెల సమయం పడుతుందని, 1.04 క్యారెట్ ఒరిజినల్ రఫ్ డైమండ్‌ను బ్యాట్‌కు పొదుగుతున్నట్లు బిజినెస్‌మెన్ తెలిపారు. డైమండ్ పొదిగిన తర్వాత ఆ బ్యాట్ విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని సమాచారం. డైమండ్ టెక్నాలజీ నిపుణుడు, సూరత్‌లోని లెక్సస్ సాఫ్ట్‌మాక్ కంపెనీ డైరెక్టర్ ఉత్పల్ మిస్త్రీ డైమండ్ బ్యాట్‌ను తయారు చేసే ప్రక్రియను సైతం ఇప్పటికే పర్యవేక్షించినట్లు తెలుస్తోంది.
అయితే.. కోహ్లీ ఆ బ్యాట్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడతాడా? లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. అసలు ఆ బ్యాట్‌ను కోహ్లీ బహుమతిగా స్వీకరిస్తాడా? బిజినెస్‌మెన్ కోహ్లీని కలిసి ఆ బ్యాట్‌ను అందించడం వీలవుతుందా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే.. మరికొన్ని వారాల్లో ఆసియా కప్ 2023, ఆ వెంటనే వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ బీజీ టైమ్‌లో కోహ్లీని అతను కలవడం బ్యాట్ ఇచ్చినా.. కోహ్లీ ఆ బ్యాట్‌తో ఆడటం కష్టమే అంటున్నారు క్రికెట్ నిపుణులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A business man from Surat set to gift a 1.04 carat diamond studded bat ahead of the World cup to Virat Kohli.
It cost around 10 Lakhs. [India Today] pic.twitter.com/6S1MjCo1Cg
— Johns. (@CricCrazyJohns) August 18, 2023
ఇదీ చదవండి: టీమిండియాకి చాలా ఈజీగా ఆడేస్తున్నారు! అదే జరిగితే.. బుమ్రా ఇంటికే