iDreamPost
android-app
ios-app

క్రికెటర్‌ షమీకి షాక్‌! సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

  • Published Jul 06, 2023 | 4:58 PM Updated Updated Jul 06, 2023 | 4:58 PM
  • Published Jul 06, 2023 | 4:58 PMUpdated Jul 06, 2023 | 4:58 PM
క్రికెటర్‌ షమీకి షాక్‌! సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. విడాకుల కేసులో అతని భార్యకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా కాలంగా భార్య హసీన్‌ జహాన్‌తో షమీ విడిగా ఉంటున్నాడు. షమీపై తీవ్ర ఆరోపణలు చేసి హసీన్‌ అతనిపై గృహహింస కేసు పెట్టింది. పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టులో వీరి కేసు నడుస్తోంది. హసీన్‌ చేసిన తీవ్ర ఆరోపణ నేపథ్యంలో 2019 ఆగస్టులో అలీపూర్‌ అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ షమీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

తనపై వచ్చిన ఆరోపణలు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన షమీ.. తనను అరెస్ట్‌ చేయకుండా సెషన్స్‌ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. అలాగే తనపై ఎలాంటి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ లేకుండా చూడాలని కోర్టును కోరాడు. ఈ స్టేపై హసీన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయక అక్కడ ఆమెకు చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఆమె పిటిషన్‌ను గురువారం విచారించిన సుప్రీం కోర్టు.. ఏళ్లకు ఏళ్లు కేసును సాగదీయవద్దని, హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టి నెల రోజుల్లో కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. దీంతో.. మరో నెల రోజుల్లో షమీ భవితవ్యం తేలిపోనుంది. అయితే.. వన్డే, టెస్టు జట్లలో షమీ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.