SNP
SRH vs LSG, Travis Head, IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఈ ఇన్నింగ్స్‌లో హెడ్ నమోదు చేసిన ఒక రికార్డు ఉంది. అదేంటో ఇప్పుడుచూద్దాం..
SRH vs LSG, Travis Head, IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఈ ఇన్నింగ్స్‌లో హెడ్ నమోదు చేసిన ఒక రికార్డు ఉంది. అదేంటో ఇప్పుడుచూద్దాం..
SNP
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసి.. లక్నో నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను ఓపెనర్లే ఊదిపారేశారు. ఇద్దరు ఓపెనర్లు శివాలెత్తి మరీ బ్యాటింగ్ చేశారు.. పోటీ పడి.. ఫోర్లు, సిక్సులు బాదారు. లక్నో బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. కేవలం 9.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసి.. లక్నోకు కళ్లుబౌర్లు కమ్మేలా చేశారు. అయితే.. మరి ఇంతటి విధ్వంసంలో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ఎన్ని సింగిల్స్ తీశారో తెలిస్తే.. సగటు క్రికెట్ అభిమాని షాక్ అవ్వడం ఖాయం.
సేమ్ పిచ్‌పై 165 పరుగులు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. కేఎల్ రాహుల్, డికాక్, స్టోనియిస్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు సైతం విఫలమైన చోట.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నిప్పులు చెరిగారు. 166 పరుగుల టార్గెట్‌ను ఫోర్లు, సిక్సులతో డీల్ చేస్తూ.. కేవలం 9.4 ఓవర్లలో అంటే 58 బంతుల్లో కొట్టిపారేశారు. అయితే.. ఈ విధ్వంసకర ఛేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అసలు సింగిల్స్ ఉంటాయన్న విషయమే మర్చిపోయినట్లు ఉన్నారు. ఎంతసేపటికీ.. ఫోర్లు, సిక్సులు బాదాలని చూశారు తప్పితే.. రన్స్ తీయడం మర్చిపోయారు. 166 పరుగుల రన్ ఛేజ్‌లో 16 ఫోర్లు, 14 సిక్సులు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు కేవలం 12 సింగిల్స్ మాత్రమే తీశారు. అందులో కూడా ఒకటి లెగ్ బైస్ రూపంలో వచ్చింది. అలాగే రెండు డబుల్స్ కూడా ఉన్నాయి.
వైడ్ల రూపంలో రెండు ఎక్స్‌ట్రాలు వచ్చాయి. కేవలం ఫోర్లు, సిక్సులతోనే 148 పరుగులు సాధించింది హెడ్, అభిషేక్ శర్మ జోడి. అయితే.. ట్రావిస్ హెడ్ ఏకంగా సింగిల్ తీయకుండానే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక్క సింగిల్ కూడా తీయకుండా ఏకంగా 64 పరుగులు చేశాడు. ఇది కూడా ఒక రికార్డే. ఈ విధ్వంసం చూసిన తర్వాత.. ఇది కేసీపీడీ బ్యాటింగ్ అంటూ క్రికెట్ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. అయితే.. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. టాప్ వన్ లేదా టూగా ప్లే ఆఫ్స్‌కు చేరవచ్చు. మరి ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్‌పై, 166 పరుగుల రన్ ఛేజ్‌లో కేవలం 12 సింగిల్స్ మాత్రమే ఉండటం, ట్రావిస్ హెడ్ సింగిల్ తీయకుండా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0,1,0,1LB,WD,1,4,0,0,4,4,WD,4,4,6,0,4,6,6,0,6,1,4,0,0,6,1,4,4,6,4,4,4,0,6,4,0,6,6,1,6,1,1,4,4,0,6,1,0,6,2,6,4,4,0,1,1,2,1,6.
SRH’S HISTORIC CHASE IN A SINGLE TWEET. 🤯 pic.twitter.com/1PiMu0yH6v
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2024