SNP
SRH vs RR, IPL 2024: టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ విజయంతోనే తమ టీమ్ హిస్టరీలోనే తొలి సారి ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దాని విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SRH vs RR, IPL 2024: టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ విజయంతోనే తమ టీమ్ హిస్టరీలోనే తొలి సారి ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దాని విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంత మంచి స్టార్ట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. ఈ సీజన్‌లో వాళ్లు ఆడుతున్న శైలికి పూర్తి భిన్నంగా బ్యాటింగ్ చేశారు. ఈ సీజన్‌లో 6 ఓవర్లలో 125 పరుగులు బాదిన ఓపెనర్లు 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేశారు. ఐదో ఓవర్ తొలి బంతికి 10 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ బాదినా.. 44 బంతుల్లో 58 పరుగులు చేసి.. తన దూకుడు శైలికి పూర్తి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్ అవుట్ అయ్యాక.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. నితీష్ 42 బంతుల్లో 76, క్లాసెన్ 19 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు.
వీరిద్దరి బ్యాటింగ్‌తో 170కి పరిమితం అవుతుందనుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. 201 పరుగులు చేసి.. పటిష్టస్థితిలో నిలిచింది. ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసే సక్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ చివరి బాల్ వరకు మ్యాచ్ సాగడంతో క్రికెట్ అభిమానులకు మస్తు మజా వచ్చింది. అసలు సిసలు టీ20 క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించారు. పైగా చివర్లో మన హోం టీమ్ సన్‌రైజర్స్ విజయం సాధించడంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే.. ఈ ఒక్క పరుగు విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఖాతాలో ఒక అరుదైన రికార్డును వేసుకుంది. ఇలా ఒక్క పరుగు తేడాతో అంటే ఇంత తక్కువ మార్జిన్‌తో మ్యాచ్ గెలవడం సన్‌రైజర్స్‌కు ఇదే తొలి సారి. అయితే.. ఇదే సీజన్‌లో పంజాబ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు రాజస్థాన్‌పై బ్రేక్ చేసింది. గతంతో ముంబై ఇండియన్స్‌పై 2022లో 3 రన్స్ తేడాతో, 2014లో ఢిల్లీపై 4 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 76, ట్రావిస్ హెడ్ 58, హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్‌తో పర్వాలేదనిపించారు. ఇక 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌ఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆర్‌ఆర్ బ్యాటర్లలో 67, రియాన్ పరాగ్ 77 పరుగులతో అద్భుతంగా ఆడినా.. రాజస్థాన్‌ను గెలిపించలేకపోయారు. సరైన టైమ్‌లో వికెట్లు పడగొట్టి.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు మ్యాచ్‌ను గెలిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భుమనేశ్వర్ కుమార్ 3, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, టీ నటరాజన్ 2 వికెట్లతో అదరగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుతో విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్ సాధించిన కొత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ONE OF THE CRAZY COMEBACK IN IPL HISTORY.
PAT CUMMINS ARMY DONE IT IN HYDERABAD 🔥pic.twitter.com/4mZXpC1bFR
— Johns. (@CricCrazyJohns) May 2, 2024