SNP
SRH vs RCB, Virat Kohli, Uppal: ఉప్పల్‌లో ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ ఆ ఒక్కడిని చూసి భయపడుతోంది. ఆ ఒక్కడు ఎవరు? ఎందుకు ఎస్‌ఆర్‌హెచ్ భయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
SRH vs RCB, Virat Kohli, Uppal: ఉప్పల్‌లో ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఎస్‌ఆర్‌హెచ్ ఆ ఒక్కడిని చూసి భయపడుతోంది. ఆ ఒక్కడు ఎవరు? ఎందుకు ఎస్‌ఆర్‌హెచ్ భయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డిఫరెంట్ వే ఆఫ్ క్రికెట్ ఆడుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఆడుతున్న తీరు చూసి.. ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. 11 ఏళ్లుగా ఉన్న ఐపీఎల్‌లో ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును ఈ సీజన్‌లోనే ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది ఎస్‌ఆర్‌హెచ్.. ఈ ఒక్క విషయంతో సన్‌రైజర్స్ ఆట ఏ లెవెల్ ఆఫ్ విధ్వంసంలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి ఉప్పల్ పిచ్‌పై ఆర్సీబీ లాంటి వీక్ బౌలింగ్ ఎటాక్ ఉన్న టీమ్‌తో మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కనుక తొలుత బ్యాటింగ్ చేస్తే.. 300 కొట్టేస్తుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు కారణం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287 పరుగులను ఎస్‌ఆర్‌హెచ్ ఆర్సీబీపైనే కొట్టింది. అది కూడా చిన్నస్వామి స్టేడియంలో.. ఇప్పుడు మ్యాచ్ ఉప్పల్‌లో ఇది బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉండే పిచ్. దీంతో.. ఈ సారి 300 మార్క్ దాటడం ఖాయం అంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ కూడా ఈ విషయంపై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. కానీ, ఒక్క విషయం మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ను భయపెడుతోంది. నిజానికి ఒక ఆటగాడు.. ఒకే ఒక్క ఆటగాడు చరిత్ర సృష్టిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ను భయపెడుతున్నాడు.. అతనే విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నా విషయం తెలిసిందే. అత్యధిక రన్స్‌తో ఈ సీజన్‌లోనే నంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆరెంజ్ క్యాచ్ అతనే ధరిస్తున్నాడు.
పైగా ఇదే ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ చివరి సారిగా ఆడిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అది కూడా ఎస్‌ఆర్‌హెచ్‌పైనే. ఐపీఎల్ 2023లో ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 62 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. అలాగే.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీపై 287 పరుగులు చేసి మాట వాస్తవమే. కానీ, బదులుగా ఆర్సీబీ కూడా 262 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అతను కొంతసేపు ఉంటే.. కచ్చితంగా ఫలితం ఇంకోలా ఉండేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్, ఉప్పల్ పిచ్‌పై అతనికి ఉన్న ట్రాక్ రికార్డ్ అన్నీ చూస్తే.. సన్‌రైజర్స్‌కు ఆర్సీబీ విజయం అంత ఈజీ కాదు అనిపిస్తోంది. దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా.. ఎస్‌ఆర్‌హెచ్.. కోహ్లీని చూసి భయపడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Last time when RCB played at Hyderabad.pic.twitter.com/jZIKy6vEbo
— Kevin (@imkevin149) April 24, 2024