iDreamPost
android-app
ios-app

IPL 2024: KKRపై ఓటమి.. ఆ ఒక్క నిర్ణయమే మా కొంపముంచింది: కమ్మిన్స్

  • Published May 22, 2024 | 7:41 AM Updated Updated May 22, 2024 | 7:41 AM

ఇప్పటి వరకు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వచ్చిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్ లో చేతులెత్తేశారు. కేకేఆర్ తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో తమ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ కమ్మిన్స్.

ఇప్పటి వరకు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వచ్చిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్ లో చేతులెత్తేశారు. కేకేఆర్ తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో తమ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ కమ్మిన్స్.

IPL 2024: KKRపై ఓటమి.. ఆ ఒక్క నిర్ణయమే మా కొంపముంచింది: కమ్మిన్స్

కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించి దిగ్విజయంగా ఐపీఎల్ 2024 ఫైనల్లోకి ప్రవేశించాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ తగిలింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే SRH కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉండటం ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే విషయం. ఇప్పటి వరకు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వచ్చిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్ లో చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.

కేకేఆర్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా విఫలం అయ్యింది. దాంతో 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన SRHకు ఆదిలోనే ఊహించని షాకిచ్చాడు మిచెల్ స్టార్క్. లీగ్ మ్యాచ్ ల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్.. ఈ మ్యాచ్ తో మంచి టచ్ లోకి వచ్చాడు. తొలి ఓవర్లోనే ప్రమాదకర ట్రావిస్ హెడ్(0) బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చిచ్చర పిడుగు అభిషేక్ శర్మ(3)ను వైభవ్ అరోరా అవుట్ చేయగా.. తన తర్వాతి ఓవర్లో స్టార్క్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి(9), షహబాజ్ అహ్మద్(0)లను పెవిలియన్ కు చేర్చి హైదరాబాద్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.

అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రాహుల్ త్రిపాఠి మాత్రం కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ తో 55 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. చివర్లో క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్టార్క్ 3, చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలోనే దంచికొట్టింది కేకేఆర్. వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 58* రన్స్ చేసి చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమ్ ను గెలిపించాడు.

కాగా.. ఈ మ్యాచ్ లో తమ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. “మాకు ఫైనల్ చేరడానికి ఇంకో ఛాన్స్ ఉంది. అందుకే ఈ పరాజయాన్ని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. మేం బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం అయ్యాం. ఇక ఈ పిచ్ ను బట్టి బ్యాటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించాలని భావించాం. అందుకే సన్వీర్ సింగ్ కు ఛాన్స్ ఇచ్చాం. కానీ మా నిర్ణయం బెడిసికొట్టి.. ఓడిపోయాం. అయితే చెన్నై పిచ్ మాకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాను. ఆ మ్యాచ్ లో గెలుస్తామని నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు కమ్మిన్స్.