SNP
SNP
సాధారణంగా ఫుట్‌బాల్ ఆటలో ప్లేయర్లు అతిగా ప్రవర్తిస్తే.. ఆన్‌ఫీల్డ్ రిఫరీ వారికి ఎల్లో కార్డ్ చూపిస్తాడు. దాంతో ఆ ఆటగాడు గ్రౌండ్ నుంచి తాత్కాలికంగా బయటికి వెళ్లిపోవాలి. అది ఆ టీమ్‌కు విధించే పెనాల్టీ. తాజాగా ఇలాంటి రూల్‌ను క్రికెట్‌లోకి తీసుకొచ్చింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. విండీస్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో రెడ్ కార్డ్ రూల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో తొలి సారి రెడ్ కార్డ్‌ను వాడారు అంపైర్లు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ – ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ రెడ్ కార్డ్ చోటు చేసుకుంది.
నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ చేస్తున్న క్రమంలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు రెడ్ కార్డ్ పెనాల్టీని విధించారు. సీపీఎల్‌లో ప్రవేశపెట్టిన స్లో ఓవర్ రేట్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ అయినా 20వ ఓవర్ కంటే ముందు బౌలింగ్ టీమ్ నిర్దేశిత సమయానికి కంటే వెనుకబడి ఉంటే ఈ రెడ్ కార్డ్ పెనాల్టీని అమలులోకి తీసుకొస్తారు. ఒక ఇన్నింగ్స్ కోసం 85 నిమిషాలు కేటాయించారు. ప్రతి ఓవర్‌కు నాలుగు నిమిషాల 15 సెకన్ల ఇచ్చారు. ఈ లెక్క ప్రకారం 19 ఓవర్లు 80 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి. ఈ సమయాన్ని కచ్చితంగా ఫాలో కాకుండా.. ఎక్కువ టైమ్ తీస్కొని ఉండి ఉంటే.. 20వ ఓవర్ కంటే ముందు రెడ్ కార్డ్‌ను ఫీల్డ్ అంపైర్ చూపిస్తారు.
ఫీల్డ్ అంపైర్ అలా రెడ్‌కార్డ్ చూపిస్తే.. ఆ జట్టు కెప్టెన్ తన టీమ్‌లోని ఓ ప్లేయర్‌ను గ్రౌండ్ బయటికి పంపించాల్సి ఉంటుంది. మిగిలిన 10 మందితోనే చివరి ఓవర్‌ను కొనసాగించాలి. పైగా ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే థర్టీ యార్డ్ సర్కిల్ బయట ఉండాలి. ఈ రెడ్ కార్డ్ పెనాల్టీకి గురైన నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తన టీమ్‌లోని సునీల్ నరైన్‌ను గ్రౌండ్ బయటికి వెళ్లాల్సింది సూచించాడు. అప్పటికే నరైన్ తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసుకోవడంతో అతను బయటికి వెళ్లిన పెద్దగా నష్టం లేదని పొలార్డ్ అతన్ని బయటికి పంపాడు. ఇలా సీపీఎల్‌లో రెడ్ కార్డ్ రూల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. ఆ రూల్‌కు బలైన తొలి ప్లేయర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. మరి ఈ రూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తెస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SENT OFF! The 1st ever red card in CPL history. Sunil Narine gets his marching orders 🚨 #CPL23 #SKNPvTKR #RedCard #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/YU1NqdOgEX
— CPL T20 (@CPL) August 28, 2023
ఇదీ చదవండి: ఆసియా కప్ కోసం ఆఫ్ఘాన్ జట్టు ప్రకటన! కోహ్లీ శత్రువుకి దక్కని చోటు