iDreamPost

Sunil Narine: ఓకే మ్యాచ్ లో ఓ చెత్త రికార్డ్.. ఒక గొప్ప రికార్డ్ సృష్టించిన నరైన్! అవేంటంటే?

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్ ఓ క్రేజీ రికార్డ్ తో పాటుగా ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ బ్యాటర్ సునీల్ నరైన్ ఓ క్రేజీ రికార్డ్ తో పాటుగా ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Sunil Narine: ఓకే మ్యాచ్ లో ఓ చెత్త రికార్డ్.. ఒక గొప్ప రికార్డ్ సృష్టించిన నరైన్! అవేంటంటే?

సునీల్ నరైన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో బౌలర్లకు చూపిస్తున్నాడు. క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. వాటికి సరికొత్త నిర్వచనంగా మారాడు. ఇక తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. దాంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ గొప్ప ఘనతతో పాటుగా ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు సునీల్ నరైన్. ఆ వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారడంతో.. మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 157 రన్స్ చేసింది. జట్టులో సాల్ట్(6), నరైన్(0), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(7) పరుగులతో విఫలం కాగా.. వెంకటేశ్ అయ్యర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. మిగతా వారిలో నితీశ్ రాణా(33), రస్సెల్(24), రింకూసింగ్(20) రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 158 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైై.. 16 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసి, 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇదిలా ఉండగా.. దాదాపు ప్రతి మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించే సునీల్ నరైన్ ను.. యార్కర్ల కింగ్ బుమ్రా అద్భుతమైన యార్కర్ తో నరైన్ ను డకౌట్ చేశాడు. దీంతో ఓ చెత్త రికార్డ్ ను నెలకొల్పాడు ఈ విండీస్ మాజీ బ్యాటర్. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక  సార్లు డకౌట్ అయిన ప్లేయర్ల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నాడు నరైన్. అతడు ఇప్పటి వరకు ఐపీఎల్ లో 16సార్లు డకౌట్ అయ్యాడు. ఓవరాల్ గా టీ20ల్లో నరైన్ డకౌట్ కావడం ఇది 44వ సారి. ఇక ఐపీఎల్ లో అత్యధిక టైమ్స్(17) డకౌట్ గా వెనుదిరిగిన ప్లేయర్ల జాబితాలో డీకే, రోహిత్ శర్మ, మాక్స్ వెల్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక సునీల్ నరైన్ సాధించిన గొప్ప రికార్డ్ ఏంటంటే? ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఓకే సీజన్ లో 400 పరుగులు చేయడంతో పాటుగా 14 వికెట్లు తీసుకున్న మూడో ప్లేయర్ గా ఘనత వహించాడు. ఈ జాబితాలో షేన్ వాట్సాన్(RR), కల్లిస్(KKR) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరి ఒకే మ్యాచ్ లో ఓ గొప్ప రికార్డ్ తో పాటుగా చెత్త ఘనతను సాధించిన నరైన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి