Somesekhar
దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దీంతో హుటాహుటిన ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ కామెంట్రీ నుంచి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు.
దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దీంతో హుటాహుటిన ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ కామెంట్రీ నుంచి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు.
Somesekhar
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది టీమిండియా. అటు ఇంగ్లాండ్ టీమ్ కూడా తొలిటెస్ట్ లో సాధించిన విజయంతో జోరుమీదుంది. ఫస్ట్ డే ఆటముగిసే సరికి టీమిండియా భారీ స్కోర్ సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. అయితే తొలిరోజు కామెంట్రీ చేస్తుండగా.. హుటాహుటిన మధ్యలోనే ఇంటికి పయనమైయ్యాడు గవాస్కర్. ఓ షాకింగ్ న్యూస్ తెలియగానే కామెంట్రీ ఆపేసి బయలుదేరాడు.
టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గవాస్కర్ అత్త అయినటువంటి పుష్పా మెుహోత్ర శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే గవాస్కర్ హుటాహుటిన తన భార్య మార్షనీల్ తో కలిసి కాన్పూర్ బయలుదేరాడు. ఫస్ట్ సెషన్ ముగిసిన తర్వాత ఈ విషాదకర వార్త తెలియడంతో.. కామెంట్రీ ఆపి వెంటనే బయలుదేరాడు. కాగా.. ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు జియో సినిమా ఇంగ్లీష్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు గవాస్కర్.
ఇక కామెంట్రీలో తనదైన గుర్తింపు సాధించాడు ఈ లెజెండ్. టీమిండియా ఆటతీరును విశ్లేషించడంతో పాటుగా ప్లేయర్లకు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటాడు. అయితే రెండేళ్ల క్రితం కూడా ఈ దిగ్గజ క్రికెటర్ ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో కామెంట్రీ చెబుతుండగా.. తన తల్లి మరణవార్తను విన్నారు. అయినా గానీ తన కామెంట్రీని కొనసాగించి స్ఫూర్తిని చాటుకున్నాడు. తాజాగా మరోసారి గవాస్కర్ ఇంట విషాదం నెలకొనడంతో.. అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Sunil Gavaskar’s mother-in-law passes away.#INDvsENG #SunilGavaskar #IndianCricket #CricketTwitter pic.twitter.com/trMXiTfeSb
— InsideSport (@InsideSportIND) February 2, 2024
ఇదికూడా చదవండి: Sachin-Sudeep: కిచ్చ సుదీప్ కు సచిన్ ఊహించని సర్ప్రైజ్.. అదేంటంటే?