iDreamPost
android-app
ios-app

బుమ్రా కాదు.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం అతడే: గవాస్కర్

  • Published Jul 05, 2024 | 3:38 PM Updated Updated Jul 05, 2024 | 3:38 PM

టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ జస్ప్రీత్ బుమ్రా వల్ల కాదు.. అతడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు?

టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ జస్ప్రీత్ బుమ్రా వల్ల కాదు.. అతడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు?

బుమ్రా కాదు.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం అతడే: గవాస్కర్

టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాకు 140 కోట్ల మంది భారతీయులు జేజేలు పలికారు. 13 ఏళ్ల వరల్డ్ కప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఇక టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా. విజయంపై ఆశలు వదిలేసుకున్న ప్రతీసారి రంగంలోకి దిగి జట్టుకు అద్బుతమైన విజయాలు అందించాడు ఈ యార్కర్ల కింగ్. బీసీసీఐ సన్మాన కార్యక్రమంలో కూడా వరల్డ్ కప్  గెలవడానికి కారణం బుమ్రానే అని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం బుమ్రా వల్ల కాదు.. అతడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడని జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో ప్లేస్ లో ఉన్నాడు. అతడు ఈ మెగాటోర్నీలో 15 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఫజల్ హక్ ఫరూఖీ, అర్షదీప్ సింగ్ లను కాదని బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం బుమ్రా కాదని, కెప్టెన్ రోహిత్ శర్మనే అని చెప్పుకొచ్చాడు దిగ్గజం సునీల్ గవాస్కర్.

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..”టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డుకు అర్హుడే. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అయితే బుమ్రా కంటే ఎక్కువగా వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మనే. రోహిత్ కెప్టెన్సీ గొప్పగా ఉంది.. ఒత్తిడి ఉన్న సమయంలో అతడు  తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అతడు ఎక్కడా తగ్గలేదు. భారత జట్టులో అతడి కెప్టెన్సీనే నాకు అత్యుత్తమ ప్రదర్శనగా అనిపించింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.