Somesekhar
అతడి ఆటతీరు చూస్తుంటే టీమిండియాకు నెక్ట్స్ ధోని అవుతాడని.. ఓ యంగ్ ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్. మరి టీమిండియా భవిష్యత్ ధోని ఎవరు? ఇప్పుడు చూద్దాం.
అతడి ఆటతీరు చూస్తుంటే టీమిండియాకు నెక్ట్స్ ధోని అవుతాడని.. ఓ యంగ్ ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్. మరి టీమిండియా భవిష్యత్ ధోని ఎవరు? ఇప్పుడు చూద్దాం.
Somesekhar
టీమిండియాలోకి ఎంతో మంది యువ క్రికెటర్లు ఎంట్రీ ఇస్తున్నారు. అద్భుతమైన ఆటతీరుతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు కృషి చేస్తున్నారు. యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్ లాంటి యంగ్ ప్లేయర్లు టీమిండియాలోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అరంగేట్రం చేశాడు. నాలుగో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆధిక్యం తగ్గించడంలో.. జురెల్ పాత్ర కీలకమైంది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అద్భుతమైన నాక్ తో ప్రేక్షకులను అలరించాడు. తొలి ఇన్నింగ్స్ లో 149 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ 46 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇక ధృవ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ జురెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
“ప్రస్తుతం ఈ మ్యాచ్ లో జురెల్ బ్యాటింగ్ చూస్తే నాకు ముచ్చటేసింది. అతడు ఆడుతున్న విధానం, షాట్ సెలెక్షన్, ఆలోచన విధానం అన్ని చూస్తుంటే.. భవిష్యత్ లో టీమిండియాకు మరో ధోని అవుతాడనిపిస్తోంది. అంతలా జురెల్ ఆటతీరు నన్ను ఆకట్టుకుంది” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సునీల్ గవాస్కర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా.. ఇండియా 307 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. మరి ధృవ్ జురెల్ టీమిండియా నెక్ట్స్ ధోని అన్న గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar said, “watching the presence of mind of Dhruv Jurel makes me think he’s the next MS Dhoni in the making”. pic.twitter.com/jxGgIaXcKl
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
ఇదికూడా చదవండి: కుల్దీప్ మాయ.. బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో! ఏంటి సామి ఈ మార్పు!