రోహిత్‌ శర్మను అలా అనడం సరికాదు! సునీల్‌ గవాస్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

రోహిత్‌ శర్మను అలా అనడం సరికాదు! సునీల్‌ గవాస్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Sunil Gavaskar, Rohit Sharma, IND vs AFG, T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sunil Gavaskar, Rohit Sharma, IND vs AFG, T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. తొలి ఓవర్‌ నుంచే టచ్‌లో లేనట్టు కనిపించిన రోహిత్‌.. కాస్త స్ట్రగుల్‌ అయ్యాడు. ఆఫ్ఘాన్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఫారూఖీ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆఫ్ సైడ్ పడిన బంతిని లెగ్ సైడ్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇది చెత్త షాట్‌ అంటూ.. దీన్ని రోహిత్‌ ఎలా ఆడతాడంటూ చాలా మంది రోహిత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం రోహిత్‌ను వెనకేసుకొచ్చాడు.

రోహిత్ బ్యాటింగ్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవాస్కర్‌.. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశాడు. గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. ఎలా ఆడాలనేది అతనికి బాగా తెలుసు. బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని అతనికి చెప్పడం సరికాదు. ప్రపంచ క్రికెట్‌లో ఏ బ్యాటర్ అయినా బౌలర్‌ను బట్టి ఆడుతాడు, ఆఫ్‌సైడ్ వేసిన బంతి లెగ్ సైడ్ ఆడాడంటే దానికి రోహిత్‌ వద్ద కారణం ఉండొచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను చాలా రన్స్‌ చేశాడు. అయితే ఏదో ఒక సమయంలో బ్యాటర్ ఔట్ కావాల్సిందే. అలాగని ఆఫ్‌స్టంప్ బయట వేసిన బంతిని ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరితే దానికి బలహీనతగా చూడాల్సిన అవసరం లేదు’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు

 

అయితే.. రోహిత్‌ శర్మకు లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వీక్‌నెస్‌ ఉన్న విషయం తెలిసిందే. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు బౌలింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్‌ చాలా ఇబ్బంది పడుతుంటాడు. వారికే తన వికెట్‌ ఎక్కువ సార్లు ఇచ్చాడు. ఈ ఏడాది టీ20ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 8 సార్లు లెఫ్టార్మ్ పేసర్లకే ఔటయ్యాడు. మొత్తం 98 బంతులు ఎదుర్కొని 128 రన్స్‌ మాత్రమే చేశాడు. అయితే.. రోహిత్‌ ఒక్కసారి ఫామ్‌ అందుకుంటే.. ఎలాంటి బౌలర్‌నైనా సునాయాసంగా ఎదుర్కొగలడు. కానీ, ప్రస్తుతం అతను బ్యాడ్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి అందరు విమర్శిస్తున్న సమయంలో రోహిత్‌కు గవాస్కర్‌ మద్దతుగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments