iDreamPost
android-app
ios-app

సునీల్ గవాస్కర్ నోటి దూల! జోకర్‌ని చేసిన టీమిండియా ప్లేయర్స్!

  • Published Jun 10, 2024 | 10:40 AM Updated Updated Jun 10, 2024 | 10:40 AM

Sunil Gavaskar, IND vs PAK. T20 World Cup 2024: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. కానీ, మ్యాచ్‌ మధ్యలో సునీల్‌ గవాస్కర్‌ నోరుపారేసుకుని.. మ్యాచ్‌ తర్వాత జోకర్‌లా మిగిలారు..

Sunil Gavaskar, IND vs PAK. T20 World Cup 2024: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. కానీ, మ్యాచ్‌ మధ్యలో సునీల్‌ గవాస్కర్‌ నోరుపారేసుకుని.. మ్యాచ్‌ తర్వాత జోకర్‌లా మిగిలారు..

  • Published Jun 10, 2024 | 10:40 AMUpdated Jun 10, 2024 | 10:40 AM
సునీల్ గవాస్కర్ నోటి దూల! జోకర్‌ని చేసిన టీమిండియా ప్లేయర్స్!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందించింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైనా.. టీమిండియా బౌలర్లు అత్యాద్భుతంగా రాణించి.. కేవలం 119 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని సూపర్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించారు. అయితే.. ఈ మ్యాచ్‌ పూర్తి కాకముందు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు. టీమిండియా బ్యాటింగ్‌ అయిపోయిన తర్వాత సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు బాధ్యత లేకుండా, చాలా నిర్లక్ష్యంగా, పొగరుగా బ్యాటింగ్‌ చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ అభిమానులు గవాస్కర్‌ను విమర్శిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

పాక్‌తో న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉందనే విషయం తెలిసిందే. పైగా మ్యాచ్‌కి ముందు వర్షం కూడా పడింది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఎంత టఫ్‌ పిచ్‌ ఉన్నా.. టీమిండియా మినిమమ్‌ స్కోర్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ, పాక్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. 119 పరుగులకే భారత్‌ను ఆలౌట్‌ చేశారు. ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత.. స్టార్‌ స్పోర్ట్స్‌లో కామెంటేటర్‌గా చేస్తున్న గవాస్కర్‌.. నోటికి పనిచెప్పారు. ఇంత స్కోర్‌ చేసిన భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. చాలా నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఆడారంటూ మండిపడ్డారు.

చాలా కాలంగా విరాట్‌ కోహ్లీపై అవసరం ఉన్నా, లేకపోయినా విమర్శలు చేసే గవాస్కర్‌.. ఇప్పుడు మొత్తం టీమ్‌ను టార్గెట్‌ చేసి తిట్టినంత పనిచేశారు. టీమిండియాలో లోపాలు, మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేదని చెప్పి ఉంటే ఆయన స్థాయికి హుందాగా ఉండేది. కానీ, కఠినమైన పిచ్‌పై విఫలమైన చోట గవాస్కర్‌ ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు క్రికెట్‌ అభిమానులు. గవాస్కర్‌ ఈ కామెంట్స్‌ చేసిన తర్వాత.. పాక్‌ను 113 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించి.. గవాస్కర్‌ పరువుతీశారు. నిజానికి అతన్ని ఓ జోకర్‌ని చేశారు. మ్యాచ్‌ తర్వాత పాక్‌ మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ మాత్రం ఎంతో హుందాగా మాట్లాడాడు. జస్ప్రీత్‌ బుమ్రా లాంటి మ్యాచ్‌ విన్నర్‌ ఏ టీమ్‌లో ఉంటే.. ఆ జట్టు ఇలాంటి పిచ్‌పై విజయం సాధిస్తుందని, ఇప్పుడు ఇండియా అదే చేసి చూపించిందని అన్నాడు. కానీ, గవాస్కర్‌ మాత్రం అనవసరంగా టీమిండియా బ్యాటర్లపై తన నోటి దూలను చూపించి.. నవ్వుల పాలయ్యారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.