iDreamPost
android-app
ios-app

యూవీ దెబ్బకు అతని కెరీర్‌ క్లోజ్‌ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు

  • Published Jul 20, 2023 | 10:29 AMUpdated Jul 20, 2023 | 10:29 AM
  • Published Jul 20, 2023 | 10:29 AMUpdated Jul 20, 2023 | 10:29 AM
యూవీ దెబ్బకు అతని కెరీర్‌ క్లోజ్‌ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు

2007లో ధోని కెప్టెన్సీలో టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో టీమిండియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏకంగా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీ ఈ ఫీట్‌ సాధించాడు. ఆ రోజు యువీ బాదుడుకి బలైంది అప్పటి ఇంగ్లండ్‌ యువ పేసర్‌ స్టువర్ట్‌ ‍బ్రాడ్‌. అప్పుడు యువీ దెబ్బకి ఆ బౌలర్‌ కెరీర్‌ క్లోజ్‌ అయిపోయిందని అంతా అనుకున్నారు.

కానీ, ఇప్పుడు అదే బౌలర్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో అతికొద్ది మంది దిగ్గజాలు మాత్రమే సాధించిన అరుదైన రికార్డును సాధించి లెజెండరీ బౌలర్‌గా ఎదిగాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్ కొత్త చరిత్ర లిఖించాడు. అతనికి ముందు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ సాధించారు. యాషెస్ సిరీస్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో బ్రాడ్‌ ఈ మార్క్‌ అందుకున్నాడు. బుధవారం ప్రారంభమైన టెస్ట్‌లో ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసుకున్న ఘనత సాధించాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 230 ఇన్నింగ్స్‌లలో 800 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆసీస్‌ దివంగత స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 708, మూడో ప్లేస్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 688 వికెట్లతో, నాలుగో స్థానంలో భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే 619 వికెట్లతో ఉన్నారు. మరి స్టువర్ట్‌ బ్రాడ్‌ 600 వికెట్లు అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లీ! పాక్‌ దిగ్గజ కెప్టెన్‌ రికార్డు బ్రేక్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి