వీడియో: రిటైర్మెంట్ వయసులోనూ కళ్లు చెదిరే క్యాచ్‌! ఊరికే గొప్ప క్రికెటర్లు అయిపోరూ..!

Steve Smith, Nitish Kumar, MLC 2024: రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న ఓ స్టార్‌ క్రికెటర్‌.. తన యంగ్‌ ఏజ్‌లో పట్టిన క్యాచ్‌ను గుర్తుచేస్తూ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Steve Smith, Nitish Kumar, MLC 2024: రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న ఓ స్టార్‌ క్రికెటర్‌.. తన యంగ్‌ ఏజ్‌లో పట్టిన క్యాచ్‌ను గుర్తుచేస్తూ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

క్రికెట్‌లో ఎన్నో అద్భుత క్యాచ్‌లు చూసి ఉంటారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచ్‌ ఎంత హైలెట్‌ అయిందో అందరికీ తెలిసిందే. సూర్య పట్టింది కేవలం క్యాచ్‌ కాదు.. వరల్డ్‌ కప్‌ గెలిచాడు అని క్రికెట్‌ అభిమానులు అన్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయని క్రికెట్‌ నిపుణులు చెబుతుంటారు. అయితే.. చాలా అద్భుతమైన క్యాచ్‌లను కుర్ర క్రికెటర్లు పడుతూ ఉంటారు. కొంతమంది గొప్ప క్రికెటర్లకు మాత్రం వయసుతో పని ఉండదు. అలాంటి క్రికెటర్లలో స్టీవ్‌ స్మిత్‌ ఒకడు. తాజాగా అతను పట్టిన క్యాచ్‌ క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటర్‌ ఫ్యాబ్‌ ఫోర్‌లో ఒకడిగా ఉన్న స్మిత్‌.. అద్భుతమైన ఫీల్డర్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ప్రస్తుతం రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అతను ఇప్పుడు కూడా తన ప్రైమ్‌టైమ్‌ను గుర్తుచేస్తూ.. కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 టోర్నీలో భాగంగా స్మిత్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టాడు. గాల్లోకి పక్షిలా ఎగురుతూ.. నమ్మశక్యం క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూసి.. వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి క్యాచ్‌ పట్టాడు ఏంట్రా బాబు అని క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్టు తరఫున ఆడుతున్న స్మిత్‌.. ఆదివారం లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్‌ కుమార్‌ మిడ్‌ వికెట్‌ వైపు ఆడిన షాట్‌.. అద్భుతంగా డైవ్‌ చేస్తూ స్మిత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ రెండో బంతిని నితీష్‌ మిడ్‌వికెట్‌ వైపు వేగంగా ఆడాడు. గాల్లో వెళ్తున్న బంతిని తన కుడివైపుకు డైవ్‌ చేస్తూ స్మిత్‌ క్యాచ్‌ అందుకోవడంతో నితీష్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ 18.4 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 130 పరుగుల టార్గెట్‌ను వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ 16 ఓవర్లో ఛేదించి గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో స్మిత్‌ అందుకున్న క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments