iDreamPost
android-app
ios-app

వీడియో: స్టీవ్‌ స్మిత్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌! చూస్తే గూస్‌బమ్స్‌ పక్కా..

  • Published Mar 02, 2024 | 12:48 PM Updated Updated Mar 02, 2024 | 1:12 PM

Steve Smith, AUS vs NZ: ఆస్ట్రేలియా సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ సంచలన ఫీల్డింగ్‌తో టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలుస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతం చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Steve Smith, AUS vs NZ: ఆస్ట్రేలియా సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ సంచలన ఫీల్డింగ్‌తో టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలుస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతం చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 02, 2024 | 12:48 PMUpdated Mar 02, 2024 | 1:12 PM
వీడియో: స్టీవ్‌ స్మిత్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌! చూస్తే గూస్‌బమ్స్‌ పక్కా..

క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లు చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు పరిశీలనగా చూస్తే గానీ వాళ్లు అలా ఎలా ఫీల్డింగ్‌ చేశారో అర్థం కాదు. మెరుపు వేగంతో స్పందిస్తూ.. బుల్లెట్‌గా దూసుకుపోయే బంతులను ఊడుముల్లా ఒడిసిపట్టుకుంటూ ఉంటారు. అలా బాల్‌ను అందుకునే క్రమంలో వాళ్లు గాల్లో పక్షుల్లా, జింకని వేటాడే చిరుత పులుల్లా కనిపిస్తూ ఉంటారు. విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, జడేజా, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ కోవకు చెందినవారే. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ సైతం గాల్లో పక్షిలా దూకుతూ.. క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేశాడు. స్మిత్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న ఆ ఫొటో చూస్తే.. అసలు అలా ఎలా దూకాడో కూడా అర్థం కానీ పరిస్థితి. ప్రస్తుతం స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసానికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకీ స్మిత్‌ ఈ స్టిన్నింగ్‌ ఫీల్డింగ్‌ ఎక్కడ చేశాడని ఆలోచిస్తున్నారా? న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తన అద్భుతమైన ఫీల్డింగ్‌ కళను ప్రదర్శిస్తున్నాడీ సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య విల్లింగ్టన్‌ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ తన సూపర్‌ ఫీల్డింగ్‌తో రెచ్చిపోతున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు సూపర్‌ క్యాచ్‌లు అందుకున్నాడు స్మిత్‌. నాథన్‌ లియోన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ తొలి బంతికి కేన్‌ విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన స్మిత్‌.. ఆ వెంటనే ట్రావిస్‌ హెడ్‌ బౌలింగ్‌లో విలి యంగ్‌ ఇచ్చిన క్యాచ్‌ను కూడా అందుకుని.. ఔరా అనిపించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కామెరున్‌ గ్రీన్‌ 174 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్‌ కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 71, హెన్రీ 42 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలయ్యారు. ఇక రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియాను ‍గ్లెన్‌ ఫిలిప్స్‌ వణికించాడు. ఏకంగా 5 వికెట్లతో చెలరేగి ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కివీస్‌ గెలుపునకు ఇంకా 258 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే.. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.