SNP
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్మిత్ క్యాచ్చింగ్ స్కిల్స్ చూసి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్మిత్ క్యాచ్చింగ్ స్కిల్స్ చూసి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
SNP
క్రికెట్‌లో కొన్నిసార్లు భలే ఫన్నీ థింక్స్ జరుగుతూ ఉంటాయి. మ్యాచ్‌కు ఏ మాత్రం సంబంధం లేని కొన్ని సంఘటనలు సైతం ఆటగాళ్లపై.. ప్రేక్షకుల ప్రశంసలను కురిపిస్తోంది. అలాంటి సంఘటనే తాజాగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ సీనియర్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పట్టిన ఓ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అది బ్యాటర్ అవుట్ అయ్యేందుకు పట్టిన క్యాచ్ కాదు.. గ్రౌండ్ క్లీన్‌గా ఉండేందుకు, ఫీల్డర్లు డిస్ట్రబ్ కాకుండా ఉండేందుకు పట్టిన పేపర్ క్యాచ్. క్రికెట్‌లో అలాంటి క్యాచ్ కూడా ఉంటుందా? అని కంగారు పడకండి. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పాకిస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా గ్రౌండ్‌లోకి ఓ పేపర్ గాలికి కొట్టుకొచ్చింది. అది అలా గాలికి ఎగురుతుంటే.. ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో.. ఓ ఆసీస్ ప్లేయర్ దాన్ని తీసి జేబులో పెట్టుకుందాం అని ప్రయత్నించగా.. అ కాగితం గాలికి అలా ముందుకు కొట్టుకెళ్తూ ఉంటుంది. దాన్ని పట్టుకునేందుకు ఆసీస్ ఆటగాళ్లు నాథన్ లయన్, ఉస్మాన్ ఖవాజా ప్రయత్నించినా అది చిక్కదు. ఊర్లలో కోళ్లు పట్టేందుకు పిల్లలు ప్రయత్నించినట్లు.. ఆసీస్ ఆటగాళ్లు ఆ పేపర్‌ను పట్టుకునేందుకు తిప్పలు పడ్డారు. కానీ, స్మిత్ మాత్రం.. దాన్ని ఒక్క ఉదుటునా.. ఒడిసి పట్టాడు. అంతే.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా చప్పట్లతో స్మిత్‌ను అభినందించారు. ఓ మంచి క్యాచ్ పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ను పెవిలియన్ పంపినంత సంబురపడిపోయారు ఆసీస్ అభిమానులు, స్మిత్.
ప్రస్తుతం ఆ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. అదే స్థాయిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. స్మిత్‌కు దొంగకోళ్లు పట్టే అలవాటు బాగా ఉన్నట్టు ఉంది. అందుకే ఎంతో నేర్పుగా ఆ పేపర్‌ను పట్టుకుని జేబులో వేసుకున్నాడంటూ సరదాగా పేర్కొంటున్నారు. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగుల భారీ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో అయితే అత్యంత దారుణంగా 89 పరుగులకే కుప్పకూలి.. ఏకంగా 360 పరుగులు భారీ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో స్మిత్ పట్టిన పేపర్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Steve Smith takes the catch of the day 😂#AUSvsPAK | #CricketTwitter pic.twitter.com/EVhxCGFkCa
— CricWatcher (@CricWatcher11) December 17, 2023