SNP
క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయని చాలా మంది అంటుంటారు. కానీ, కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపించకపోయినా.. క్రికెట్ అభిమానుల మనుసులు గెలుచుకుంటాయి. అలాంటి క్యాచే ఇది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయని చాలా మంది అంటుంటారు. కానీ, కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపించకపోయినా.. క్రికెట్ అభిమానుల మనుసులు గెలుచుకుంటాయి. అలాంటి క్యాచే ఇది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టడం సర్వసాధారణం. కానీ కొన్ని సార్లు మాత్రం.. క్యాచ్ పట్టిన విధానం వావ్ అనేలా ఉంటుంది. క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లు, గొప్ప బౌలర్లతో పాటు అద్భుతమైన ఫీల్డర్లు ఉంటారు. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రింకూ సింగ్ ఫీల్డింగ్‌లో పాదరసంలా కదులుతుంటారు. గతంలో యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, సురేష్ రైనాలు టీమిండియా స్టార్ ఫీల్డర్లుగా ఉండేవారు. వాళ్లు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. అప్పట్లో టీమ్‌లో ఒకరో ఇద్దరో మెరికల్లాంటి ఫీల్డర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు మంచి ఫీల్డింగ్ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టిపెట్టడంతో అందరు బాగానే ఫీల్డింగ్ చేస్తున్నారు. కానీ, కొన్ని సార్లు.. ఫీల్డింగ్ స్టాండెడ్స్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కు చేరుతున్నాయి. సీనియర్ క్రికెట్‌లోనే అద్భుతాలు జరుగుతుంటే.. అండర్ 19లో కుర్రాళ్లు అంతకు మించి రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్ కూడా అండర్ 19 వరల్డ్ కప్‌లోనే చోటు చేసుకుంది.
ఈ అద్భుతమైన కళ్లు చెదిరే క్యాచ్‌ను వెస్టిండీస్ ఆటగాడు. స్టీఫన్ పాస్కల్ అందుకున్నాడు. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2024లో భాగంగా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో.. పాస్కల్ ఈ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇసై థోర్న్ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్ చివరి బంతికి రాఫ్ మాక్‌మిలన్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. బుల్లెట్‌లా దూసుకెళ్తున్న బంతిని గాల్లోకి పక్షిలా ఎగురుతూ.. స్టీఫన్ పాస్కల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి.. వెస్టిండీస్ టీమ్‌లోని సభ్యులే కాదు.. ఆసీస్ ప్లేయర్లు, మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సైతం నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. ఆ క్యాచ్ అలా ఉంది మరి. భూమికి సమాంతరంగా గాల్లో అలా ఎగురుతూ.. నమ్మశక్యం కాని రీతిలో పాస్కల్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ మ్యాచ్‌కే కాదు.. ఈ ఇయర్‌గా హైలెట్‌గా నిలుస్తూ.. క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రశంసలు పొందుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సామ్ కొన్స్‌టాస్ 108 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో నాథన్ ఎర్డ్వర్డ్స్ 3 వికెట్లతో రాణించాడు. 228 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 4.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 24 పరుగుల చేసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ఫలితం తేలలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో పాస్కల్ పట్టిన క్యాచ్ మాత్రం.. క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది. అతను పట్టిన క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు గ్రావిటీ అనేది ఒకటి ఉందని తెలుసా? అంటూ క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Persistent rain forced the match to be called off.
Australia progressed to the #U19WorldCup 2024 semi-finals 🇦🇺
Match Highlights 📽 pic.twitter.com/X35p2KopAJ
— ICC (@ICC) February 2, 2024