Somesekhar
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఆత్మీయ సమావేశం జరుగుతుండగానే.. స్టేజ్ పైనే అస్వస్థతకు లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఆత్మీయ సమావేశం జరుగుతుండగానే.. స్టేజ్ పైనే అస్వస్థతకు లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Somesekhar
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వల్ప అస్వస్థతకు గురైంది. పారిస్ నుంచి వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఆమెకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు జనాలు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం జరుగుతుండగానే స్టేజ్ పైనే వినేశ్ అస్వస్థతకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒలింపిక్స్ లో 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో అనర్హత వేటుకు గురైంది భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. తాజాగా స్వదేశానికి చేరుకున్న ఆమెకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అనంతరం అక్కడి నుంచి ఆమె స్వగ్రామం అయిన హరియాణాలోని బలాలికి 10 గంటల పాటు ప్రయాణించి చేరుకుంది. ఈ క్రమంలో ఆమెకు అభిమానులు భారీగా లడ్డూలు బహూకరించారు. అనంతరం వినేశ్ కు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరుగుతుండగానే ఆమె అస్వస్థతకు గురైంది. కుర్చిలో అలాగే కూర్చోని అలాగే ఉండిపోయింది. దాంతో అందరూ కంగారు పడ్డారు. మంచి నీళ్లు తాగిన తర్వాత కాస్త కుదుటపడింది. 20 గంటలకు పైగా ప్రయాణించడం, బిజీ షెడ్యూల్, వర్కౌట్స్ కారణంగా వినేశ్ ఇబ్బంది పడింది. అందుకే ఇలా అస్వస్థతకు లోనైంది అని బజరంగ్ పూనియా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో వినేశ్ పెదనాన్న మహావీర్ ఫోగాట్, బజరంగ్ పూనియా పాల్గొన్నారు.
PARIS TO BALALI
It’s a hectic day for Vinesh Phogat. She’s traveling more than 20 hrs. #VineshPhogat #ParisOlympics2024 #wrestling #Paris2024 #ParisOlympics #Olympics pic.twitter.com/ZC5vEl8jYh
— nnis Sports (@nnis_sports) August 17, 2024