SNP
Virat Kohli, Star Sports, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 సమీపిస్తున్న తరుణంలో ఆ టోర్నకి అఫీషియల్ బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ వివాదంలో చిక్కుకుంటుంది. తాజాగా కోహ్లీని అవమానించింది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Virat Kohli, Star Sports, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 సమీపిస్తున్న తరుణంలో ఆ టోర్నకి అఫీషియల్ బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ వివాదంలో చిక్కుకుంటుంది. తాజాగా కోహ్లీని అవమానించింది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగిదంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న కోహ్లీ, సూపర్ ఫామ్‌లో కూడా ఉన్నాడు. 430 రన్స్‌తో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్ ప్లస్‌లో కొనసాగుతూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీని స్టార్ స్పోర్ట్స్ దారుణంగా అవమానించింది అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్‌పై సోషల్ మీడియాలో వైదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ స్టార్ స్పోర్ట్స్ కోహ్లీని ఎందుకు అవమానించింది? అసలు విషయం ఏంటో వివరంగా తెలుసుకుందాం..
ఐపీఎల్ తర్వాత జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్‌గా ఉంది. అయితే.. తాజాగా టీ20 క్రికెట్ అంటే భారీ సిక్సులు అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. బిగ్ సిక్స్ హిట్టర్స్ అంటూ కొంతమంది క్రికెటర్లు ఆడిన షాట్లు ఆ వీడియోలో యాడ్ చేసింది. ఆ వీడియాలో రోహిత్ శర్మ, పాకిస్థాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్, మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్‌లు ఉన్నారు. కానీ, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం లేడు. ఇదే ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. కోహ్లీని కావాలనే స్టార్ స్పోర్ట్స్ అవమానిస్తోంది అంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సులు అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ మ్యాచ్‌లో చివరి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో.. పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సులు కొట్టాడు. అందులో స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్‌ను ఐసీసీ షాట్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించింది. అలాంటి షాట్లు కొట్టే ఆటగాడిని హిట్టర్స్ లిస్ట్‌లో లేకుండా చేస్తారా అంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీకి టీ20ల్లో 117 సిక్సులు ఉన్నాయని, కానీ, టీ20 క్రికెట్‌లో కోహ్లీ కంటే తక్కువ సిక్సులు కొట్టిన పూరన్, ఇఫ్తికార్ అహ్మద్‌ను వీడియోలో చూపించారని, కానీ, కోహ్లీని మాత్రం చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The ball with soar!✈️
The crowds will roar! 🙌
In the quest for the ultimate prize, there’s plenty of sixes in store! 🏏Follow #TeamIndia as they take on the world with all eyes on the ICC Men’s #T20WorldCup2024 trophy! 🏆
Starts on 2nd June, only on Star Sports! pic.twitter.com/HXbeg0KBLR
— Star Sports (@StarSportsIndia) April 27, 2024