iDreamPost
android-app
ios-app

స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు.. కారణం ఏంటంటే?

  • Published Feb 25, 2024 | 5:57 PM Updated Updated Feb 25, 2024 | 5:57 PM

తాజాగా ఓ స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఐసీసీ. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? అతడిపై ఎందుకు నిషేధం విధించింది? ఆ వివరాలు తెలుసుకుందాం.

తాజాగా ఓ స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఐసీసీ. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? అతడిపై ఎందుకు నిషేధం విధించింది? ఆ వివరాలు తెలుసుకుందాం.

స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు.. కారణం ఏంటంటే?

గ్రౌండ్ లో ప్లేయర్లు మితిమీరి ప్రవర్తిస్తే.. వారిపై కొరడా ఝుళిపిస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). నిబంధనలకు విరుద్దంగా ఏ ఆటగాడు వ్యవహరించిన ఊరుకోదు. కచ్చితంగా అతడిపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఐసీసీ. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? అతడిపై నిషేధం విధించడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మ్యాచ్ ల సస్పెన్షన్ తో పాటుగా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించింది. ఇక ఈ సంఘటనతో హసరంగ ఖాతాలో 5 డీ మెరిట్ పాయింట్లను వేసుకున్నాడు. ఇక ఈ సస్పెన్షన్ తో బంగ్లాదేశ్ తో మార్చిలో జరిగే తొలి రెండు టీ20 మ్యాచ్ లకు అతడు దూరం కానున్నాడు. అయితే అతడిపై సస్పెన్షన్ విధించడానికి కారణం ఏంటంటే? ఆఫ్గానిస్తాన్ తో తాజాగా జరిగిన రసవత్తర పోరులో చివరి 3 బంతుల్లో శ్రీలంక 11 పరుగులు చేయాలి. ఈ క్రమంలో ఆఫ్గాన్ బౌలర్ వఫాదర్ మెుమంద్ నడుము కంటే హైట్ లో బాల్ వేశాడు. కానీ అంపైర్ నో బాల్ ఇవ్వలేదు.

Suspension on star cricketer

దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హసరంగా.. అతడిపైకి కోపంగా దూసుకొచ్చి..”కళ్లు కనిపిస్తున్నాయా? లేదా? నువ్వు ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు అంపైర్ గా పనికిరావు. వెళ్లి వేరే వర్క్ చేసుకో. ఈ బాల్ ని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు నో బాల్ అని” అంటూ దూషణకు దిగాడు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు మ్యాచ్ ల సస్పెన్షన్ వేటు వేసింది. ఇక ఇదే మ్యాచ్ లో ఆఫ్గాన్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్బాజ్ పై కూడా ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అంపైర్ సూచనలు వ్యతిరేకించినందుకుగాను అతడికి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక 3 రన్స్ తేడాతో ఓడిపోయింది.

ఇదికూడా చదవండి: వీడియో: సర్ఫరాజ్ నువ్వు హీరోవి కాదు.. రోహిత్ మాస్ వార్నింగ్!