Niroshan Dickwella: శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ కలకలం.. వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై నిషేధం!

Niroshan Dickwella: శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ కలకలం.. వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై నిషేధం!

Sri Lanka Player Niroshan Dickwella Banned: శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ కలకలం రేగింది. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో డోపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ జట్టు స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై లంక క్రికెట్ బోర్డ్ నిషేధం విధించింది. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీలంక క్రికెట్ టీమ్ లో డోపింగ్ కలకలం రేగింది. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో డోపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కమ్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు వేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ నిబంధనల ఆధారంగా ఇటీవల ఆటగాళ్లకు బోర్డ్ పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టులో నిరోషన్ విఫలం అయ్యాడు. దాంతో అతడిపై నిషేధం వేటు పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీలంక జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాపై నిషేధం విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అతడు ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ 2024లో డోపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది.  ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. క్రికెట్ మ్యాచ్ లతో పాటుగా దానికి సంబంధించిన ఇతర ఎలాంటి వ్యవహారాల్లో అతడు పాల్గొనరాదని పేర్కొంది. అయితే ఈ నిషేధం ఎన్ని రోజులు అని మాత్రం ఇంకా వెల్లడించలేదు. అతడు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఎన్ని నెలలు సస్పెన్షన్ కు గురి అయ్యాడో తెలుస్తుంది.

కాగా.. నిరోషన్ డిక్వెల్లా నిషేధానికి గురి కావడం ఇదే తొలిసారి కాదు.. 2021లో బయో బబుల్ నిబంధనలను అతిక్రమించి సస్పెండ్ అయిన ముగ్గురు క్రికెటర్లలో ఇతడు కూడా ఒకడు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. శ్రీలంక తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2,757 పరుగులు, వన్డేల్లో 1,604 పరుగులు, టీ20ల్లో 480 పరుగులు చేశాడు. మరి డోపింగ్ లో విఫలం అయ్యి నిషేధం ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments