iDreamPost
android-app
ios-app

అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ధోని.. మాహీ కోసం ఆ రూల్​ను మళ్లీ తీసుకొస్తున్న BCCI!

  • Published Aug 16, 2024 | 10:18 PM Updated Updated Aug 16, 2024 | 10:18 PM

MS Dhoni To Be Retained As Uncapped Player: ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. అయితే నెక్స్ట్ సీజన్​లో అతడు ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

MS Dhoni To Be Retained As Uncapped Player: ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. అయితే నెక్స్ట్ సీజన్​లో అతడు ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

  • Published Aug 16, 2024 | 10:18 PMUpdated Aug 16, 2024 | 10:18 PM
అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ధోని.. మాహీ కోసం ఆ రూల్​ను మళ్లీ తీసుకొస్తున్న BCCI!

ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. తాను వెళ్లాక కూడా టీమ్ బాగా పెర్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించి చూశాడు. కానీ అతడు ఫెయిలయ్యాడు. అయితే ఈ సీజన్​లో యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్​కు ఆ రోల్ ఇచ్చాడు. సీఎస్​కే ప్లేఆఫ్స్​కు చేరుకోకపోయినా రుతురాజ్ కెప్టెన్​గా ఆకట్టుకున్నాడు. ధోని అండతో టీమ్​ను బాగానే నడిపించాడు. చెన్నై జట్టు క్రమంగా సెట్ అవుతోంది కాబట్టి నెక్స్ట్ సీజన్​లో మాహీ ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో అతడి కోసం భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ధోని ఇంకొన్నాళ్లు జట్టుతోనే ఉండాలని భావిస్తున్న సీఎస్​కే యాజమాన్యం అతడ్ని వదులుకోకూడదని ఫిక్స్ అయింది. అయితే ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ ఉండటంతో మాహీని రీటెయిన్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అతడి కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తారా? అనేది అనుమానంగా మారింది. అయితే అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ధోనీని దక్కించుకోవాలనేది చెన్నై ప్లాన్ అని తెలిసింది. రీసెంట్​గా బీసీసీఐతో ఫ్రాంచైజీల మీటింగ్​లో ఇదే విషయాన్ని సీఎస్​కే స్పష్టంగా చెప్పిందట. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకుందని సమాచారం. మాహీని అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ప్రకటించడం కోసం పాత రూల్​ను మళ్లీ తీసుకురానుందట బోర్డు. ఇంటర్నేషనల్ క్రికెట్​ నుంచి రిటైరై 5 ఏళ్లు దాటిన ఆటగాళ్లను అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ప్రకటించే నిబంధనను మళ్లీ పునరుద్ధరిస్తోందట.

అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిన ఆటగాళ్లను అన్​క్యాప్డ్ ప్లేయర్లుగా ప్రకటించే రూల్ ఐపీఎల్-2008 నుంచి ఐపీఎల్-2021 వరకు అమల్లో ఉండేది. అయితే దీనిపై విమర్శలు రావడంతో తీసేశారు. అలాంటి నిబంధనను ఇప్పుడు ధోని కోసం బీసీసీఐ మళ్లీ తీసుకొస్తుందని వినిపిస్తోంది. అయితే ఈ రూల్​పై ఫ్రాంచైజీలతో జరిగిన మీటింగ్​లో సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఈ రూల్ తీసుకొస్తే అది ధోనీని అవమానించినట్లు అవుతుందని.. అంతటి స్థాయి ఆటగాడ్ని ఇలా అన్​క్యాప్డ్​గా ప్రకటించడం కరెక్ట్ కాదని ఆమె సీరియస్ అయ్యారట. అయినా ఆమె మాట వినకుండా సీఎస్​కే రిక్వెస్ట్​కు బోర్డు ఓకే చెప్పిందని టాక్. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే మాహీ నెక్స్ట్‌ ఐపీఎల్​ ఆడటం ఖాయమనే చెప్పాలి. మరి.. ధోని కోసం బీసీసీఐ రూల్​ను మార్చడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.