iDreamPost
android-app
ios-app

కోర్టు సంచలన తీర్పు.. విదేశాలకు వెళ్లకుండా ధోని సహచరుడిపై నిషేధం!

  • Author Soma Sekhar Published - 07:36 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 07:36 PM, Mon - 14 August 23
కోర్టు సంచలన తీర్పు.. విదేశాలకు వెళ్లకుండా ధోని సహచరుడిపై నిషేధం!

అవినీతి ఆరోపణల కారణంగా అతడిపై ఐసీసీ నిషేధం విధించింది. అదీకాక అంతకు ముందే ఆ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రావడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా నిషేధం విధించింది. దీంతో అతడు తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలకక తప్పలేదు. ధోని సహచరుడిగా చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం కూడా వహించాడు ఈ ఆటగాడు. ఇదంతా గతం అయినప్పటికీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా అతడిపై మరో నిషేధం పడింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అతడు విదేశాలకు వెళ్లకుండా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

సచిత్ర సేనానాయకే.. శ్రీలంక మాజీ ఆల్ రౌండర్. తన బౌలింగ్ యాక్షన్ తో అనతికాలంలోనే వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రావడంతో.. అతడిని బౌలింగ్ వేయకుండా నిషేధం విధించింది ఐసీసీ. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో సచిత్ర సేనానాయకేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది ఐసీసీ. దీంతో తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఈ ఆల్ రౌండర్. లంక తరపున ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ జట్టులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక 2013 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు ఈ లంక క్రికెటర్. కాగా.. సచిత్ర సేనానాయకే కెరీర్ ఆరంభం నుంచి వివాదాలతో సావాసం చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా నిషేధం విధించబడిన కారణంగా అతడిని విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. 2020 లంక ప్రీమియర్ లీగ్ లో ఇద్దరు క్రికెటర్లను అవినీతికి పాల్పడే విధంగా ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరి విదేశాలకు వెళ్లకుండా ధోనీ సహచరుడిపై నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: టీమిండియాకి దొరికిన టాప్-5 చెత్త కెప్టెన్స్ వీరే! పరువు తీశారు!