iDreamPost
android-app
ios-app

SL vs AFG: కొద్దిలో సంచలనం మిస్.. శ్రీలంకను వణికించిన పసికూన! మీ పోరాటానికి సెల్యూట్..

  • Published Feb 10, 2024 | 8:28 AM Updated Updated Feb 10, 2024 | 8:28 AM

ప్రపంచ క్రికెట్ లో మరో సంచలనం కొద్దిలో మిస్ అయ్యింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్గానిస్తాన్ చూపించిన అసాధారణ పోరాటానికి క్రికెట్ అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.

ప్రపంచ క్రికెట్ లో మరో సంచలనం కొద్దిలో మిస్ అయ్యింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్గానిస్తాన్ చూపించిన అసాధారణ పోరాటానికి క్రికెట్ అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.

SL vs AFG: కొద్దిలో సంచలనం మిస్.. శ్రీలంకను వణికించిన పసికూన! మీ పోరాటానికి సెల్యూట్..

కొన్ని సందర్భాల్లో విజయం కంటే పోరాటమే ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకుంటుంది. చరిత్రలో గెలుపులతో సమానంగా పోరాటల గురించి మాట్లాడుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓ పసికూన సాగించిన పోరాటం గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ టీమ్.. గతంలో ఈ జట్టును పసికూనగా భావించేవి మిగతా జట్లు. కానీ వన్డే వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఆఫ్గాన్. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. చివరి వరకు విజయం కోసం ఆఫ్గాన్ పోరాడిన తీరు అమోఘం.. అద్భుతం.

ప్రపంచ క్రికెట్ లో మరో సంచలనాన్ని సృష్టించే క్రమంలో కొద్ది దూరంలో ఆగిపోయింది ఆఫ్గానిస్తాన్ టీమ్. శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పల్లేకేలే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్గాన్ 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అయితే ఓడిపోయింది గానీ.. క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. లంక స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అఖండమైన ద్విశతకంతో ఆఫ్గాన్ బౌలర్లను ఊచకోతకోశాడు. అతడు కేవలం 139 బంతుల్లోనే 20 ఫోర్లు, 8 సిక్స్ లతో 210 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిస్సాంకను ఆపడం ఎవరితరమూ కాలేదు. ఇక అతడితో పాటుగా ఆవిష్క ఫెర్నాండో 88 రన్స్ తో రాణించాడు.

అనంతరం 382 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ జట్టు పోరాడిన తీరు అమోఘం. లంక ఇచ్చిన టార్గెట్ చూసిన తర్వాత ఆఫ్గాన్ జట్టు ఓడిపోతుందని అందరూ భావించి ఉంటారు. కానీ కొండంత లక్ష్యాన్ని చూసి వారు భయపడలేదు.. గెలుపుకన్నా పోరాటం ఘనమైందని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు. 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి వంద పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన ఆఫ్గాన్ ను ఇద్దరు బ్యాటర్లు లక్ష్యం అంచుల్లోకి తీసుకెళ్లిన తీరు మెచ్చుకోకుండా ఉండలేం. లంక బౌలర్లను ఎదుర్కొంటూ కళ్లు చెదిరే సెంచరీలతో చెలరేగారు అజ్మతుల్లా ఒమర్ జయ్, మహ్మద్ నబి.

ముఖ్యంగా ఒమర్ జాయ్ 115 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 149 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతడికి తోడు నబి 130 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్ కు 242 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఆడుతున్నంత సేపు లంకకు గెలుపుపై అశలేదనే చెప్పాలి. అయితే లంక బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బంతులు వేయడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసి, 42 రన్స్ తేడాతో పోరాడి ఓడిపోయింది. ఆఫ్గాన్ ఓడిపోయినప్పటికీ.. వారి పోరాటం మాత్రం గెలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆఫ్గాన్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు మీ పోరాటానికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆఫ్గాన్ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Jasprit Bumrah: బుమ్రాను ఆకాశానికెత్తిన బాలాజీ.. ఏకంగా ఆ లెజెండ్స్​తో పోలుస్తూ..!