శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య 6 రోజుల టెస్ట్‌ మ్యాచ్‌! ఒక రోజు ఎక్స్ ట్రా ఎందుకంటే?

Sri Lanka vs New Zealand, 6 Days Test: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని టీమ్స్‌ 5 రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ మాత్రం ఆరు రోజుల టెస్ట్‌కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sri Lanka vs New Zealand, 6 Days Test: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని టీమ్స్‌ 5 రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ మాత్రం ఆరు రోజుల టెస్ట్‌కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ అంటే 5 రోజులు ఆడతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, శ్రీలంక-న్యూజిలాండ్‌ మాత్రం 6 రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధం అవుతున్నాయి. మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు రిజర్వ్‌డేగా ఆరో రోజును ఇచ్చారనుకుంటే.. మీరు పొరపాటు పడినట్టే. సెప్టెంబర్‌ 18వ తేదీ మొదలయ్యే మ్యాచ్‌ 23వ తేదీ వరకు కొనసాగనుంది. అన్ని దేశలు ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ ఎందుకు స్పెషల్‌గా ఆరు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గతంలో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆరు రోజులు జరిగేవనే విషయం తెలిసిందే. తర్వాత వాటిని 5 రోజులకు కుదించి.. మోడ్రన్‌ క్రికెట్‌ ఆడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆరు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ ఎందుకొచ్చిందంటే.. అందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే.. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు.. వచ్చే నెలలో లంకలో పర్యటించనుంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 18న ప్రారంభం కానుంది. మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్‌ 21వ తేదీన రెస్ట్‌ డే గా ప్రకటించారు.

ఆ తర్వాత మళ్లీ మిగిలిన రెండు రోజులు మ్యాచ్‌ కొనసాగనుంది. సెప్టెంబర్‌ 21న డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆ రోజున మ్యాచ్‌ ఆపేసి.. రెస్ట్‌ డే గా ప్రకటించింది ఐసీసీ. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా ధృవీకరించింది. మూడు రోజులు మ్యాచ్‌ ఆడిన తర్వాత.. మధ్యలో ఒక రోజు రెస్ట్‌ తీసుకొని మళ్లీ మిగిలిన ఆటను తర్వాతి రెండు రోజులు ఆడనున్నాయి శ్రీలంక-న్యూజిలాండ్‌ జట్లు. మ్యాచ్‌ అయితే.. 5 రోజులే కానీ.. రెస్ట్‌ డేతో కలిపి ఆరు రోజులు అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments