SNP
2010లో సెహ్వాగ్‌కు దారుణంగా ద్రోహం చేసిన శ్రీలంక.. ఇప్పుడు మ్యాథ్యూస్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, క్రీడా స్ఫూర్తి ఇది కాదని గగ్గోలు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. అసలు లంక సెహ్వాగ్‌కు చేసిన ద్రోహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2010లో సెహ్వాగ్‌కు దారుణంగా ద్రోహం చేసిన శ్రీలంక.. ఇప్పుడు మ్యాథ్యూస్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, క్రీడా స్ఫూర్తి ఇది కాదని గగ్గోలు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. అసలు లంక సెహ్వాగ్‌కు చేసిన ద్రోహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ తో ఓ వివాదం రాజుకుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజిలో మ్యాథ్యూస్ ‘టైమ్‌డ్ అవుట్’ అయిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు ఆలస్యంగా రావడంతో అంపైర్ అతన్ని అవుట్ గా ప్రకటించారు. ఈ అవుట్ విషయంలో మైదానంలో పెద్ద డ్రామానే జరిగింది. ఒక బ్యాటర్ అవుటైన తర్వాత రూల్స్ ప్రకారం మరో బ్యాటర్ 2 నిమిషాల్లో రావాలి.. అయితే మ్యాథ్యూస్ అంతకంటే ఆలస్యం చేశాడంటూ.. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అపీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించి.. మ్యాథ్యూస్ ను అవుట్ గా ప్రకటించారు. మ్యాథ్యూస్.. షకీబ్ ను తన హెల్మెట్ స్ట్రిప్ తెగిపోయిందని..
అది మార్చేందుకే టైమ్ పట్టిందని రిక్వెస్ట్ గా చెప్పినా.. షకీబ్ వినలేదు. దీంతో చేసేందేం లేక మ్యాథ్యూస్.. గ్రౌండ్ వీడాల్సి వచ్చింది.
మ్యాచ్ తర్వాత.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని శ్రీలంక క్రికెటర్లు, ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వారందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 13 ఏళ్ల క్రితం వారు చెబుతున్న క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిన మ్యాచ్ ను గుర్తుంచుకోవాలి. మనదాకా వస్తే కానీ తెలియదన్నట్లు.. లంకేయులు వ్యవహరిస్తున్నారు. 2010 ఆగస్టు 16న దంబుల్లా వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత జట్టు విజయానికి కేవలం 1 పరుగు మాత్రమే అవసరమైన సమయంలో.. లంక బౌలర్ సూరజ్ రణ్‌దీవ్ కావాలని అతి పెద్ద నో బాల్ వేశాడు.
విజయానికి ఒక పరుగు, తన సెంచరీకి కూడా ఒక్క పరుగు మాత్రమే కావాల్సిన సమయంలో సెహ్వాగ్ రణ్‌దీవ్ బౌలింగ్ లో భారీ సిక్స్‌తో మ్యాచ్ ను ముగించి, తన సెంచరీ కూడా పూర్తి చేసుకుంటాడు. కానీ, అంతలోనే అంపైర్ నోబాల్ అని ప్రకటించడంతో.. విజయానికి కావాల్సిన ఆ ఒక్క రన్ నో బాల్‌తో రావడంతో.. సెహ్వాగ్ కొట్టిన సిక్స్ లెక్కలోకి రాదు. దీంతో అతను 99 పరుగుల వద్దే నాటౌట్ గా మిగిలిపోతాడు. మ్యాచ్ ముగుస్తుంది. అయితే.. రీప్లేలో రణ్‌దీవ్ వేసిన నో బాల్ ను చూస్తే.. అతను కావాలనే ఇంటెన్షనల్ గా క్రీజ్‌కు చాలా ముందుకు వచ్చి మరీ నోబాల్ వేసినట్లు తేలింది. అప్పుడు ఆ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఒక ఆటగాడు సెంచరీ పూర్తి చేయకుండా, కుట్రతో నో బాల్ వేయడం ఏంటని క్రికెట్ లోకం లంక టీమ్ ను దుయ్యబట్టింది. అప్పటి లంక కెప్టెన్ కుమార సంగాక్కర రణ్‌దీవ్ అలా నో బాల్ వేస్తాడని తనకు తెలియదని పేర్కొన్నాడు. ఏకంగా దానిపై శ్రీలంక బోర్డు సెహ్వాగ్ ను క్షమాపణలు కోరింది. ఇలాంటి చెత్త క్రీడా స్ఫూర్తి చూపించిన జట్టు.. ఇప్పుడు తమకు అన్యాయం జరిగిదంటూ ఏడుపులు అందుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sri Lankan Spinner Deliberately bowling a No Ball to stop Sehwag to complete his century back in 2009#AngeloMathews #BANvSL #ShakibAlHasan #ThugLife #timedout pic.twitter.com/49m39AeoUt
— Richard Kettleborough (@RichKettle07) November 6, 2023