Nidhan
ENG vs SL, Pathum Nissanka: శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. ఈ విక్టరీకి అసలు క్రెడిట్ అతడికే ఇవ్వాలి.
ENG vs SL, Pathum Nissanka: శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. ఈ విక్టరీకి అసలు క్రెడిట్ అతడికే ఇవ్వాలి.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో మోస్ట్ డేంజరస్ టీమ్స్‌లో ఇంగ్లండ్ ఒకటి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో వాళ్లను ఆపడం అంత ఈజీ కాదు. అందునా సొంతగడ్డపై ఎదురులేని రికార్డు ఉన్న ఇంగ్లీష్ టీమ్‌తో మ్యాచులు అంటేనే అందరూ భయపడతారు. పెద్ద జట్లు కూడా ఇంగ్లండ్ టూర్ అంటే వణికిపోతాయి. అక్కడి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండీషన్స్, అనూహ్యమైన స్వింగ్ అంటే జడుసుకుంటాయి. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం అనేది చాలా టీమ్స్ డ్రీమ్. సొంతగడ్డపై బెబ్బులిలా విజృంభించి ఆడే ఇంగ్లీష్ టీమ్‌ను ఆపడం మామూలు విషయం కాదు. కానీ శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 1-2తో ముగించింది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన లంక.. ఆఖరి టెస్ట్‌లో ఆతిథ్య జట్టును షేక్ చేసింది.
మూడో టెస్ట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన లంక.. ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ టీమ్ విసిరిన 219 పరుగుల టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో క్లాసికల్ బ్యాటింగ్‌తో ఇంప్రెస్ చేసిన ఓపెనర్ పతుమ్ నిస్సంక.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దుమ్మురేపాడు. 124 బంతుల్లో 127 పరుగుల ధనాధన్ బ్యాటింగ్‌తో టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేశాడు. అతడికి కుశాల్ మెండిస్ (39), వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) మంచి సహకారం అందించారు. క్రిస్ వోక్స్ సహా ఇంగ్లండ్ బౌలర్లు అందర్నీ లంక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఏ దశలోనూ ఆ టీమ్ గెలుస్తుందని అనిపించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టును 263 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్ బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా తేలిపోయారు. వికెట్ల సంగతి పక్కనబెడితే పరుగులు కట్టడి చేయలేకపోయారు.
లంక ఓపెనర్ నిస్సంక ప్రత్యర్థి జట్టును ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు. ఆరంభం నుంచే అతడు భారీ షాట్లు బాదుతూ పోయాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ కూడా చెలరేగిపోయాడు. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లు బాదేశారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించాడు. నిస్సంక 13 ఫోర్లు, 2 సిక్సులతో టెస్టును టీ20 తరహాలో ఆడేశాడు. దీంతో ఇంగ్లీష్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. మెండిస్ ఔట్ అయినా ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. మాథ్యూస్ వికెట్లు కాపాడితే.. నిస్సంక భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను త్వరగా ఫినిష్ చేశాడు. ఈ సక్సెస్‌కు ఎక్కువ క్రెడిట్ లంక తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్యకు ఇవ్వాల్సిందే. అతడి కోచింగ్‌లో ఆ టీమ్ భారత్‌తో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డిపై చిత్తు చేసింది. యువకులతో కూడిన టీమ్‌ను అతడు వెనుక నుంచి నడిపించిన తీరు, అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్ల టాలెంట్‌ను వాడుకోవడం మెచ్చుకోవాల్సిందే. అందుకే విక్టరీ కొట్టగానే లంక ప్లేయర్లంతా జయసూర్య దగ్గరకు వెళ్లారు. అతడ్ని హగ్ చేసుకున్నారు.
🚨 SRI LANKA HAVE DEFEATED ENGLAND AT THE KENNINGTON OVAL…!!! 🚨
– A victory to remember for a very long time, Nissanka is the hero. pic.twitter.com/YfHrfLOXy4
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2024