SNP
SRH, Nitish Kumar Reddy: ఫారెన్ ప్లేయర్లను ఎక్కువగా కొన్నారని విమర్శలు చేసిన వారికి ఎస్‌ఆర్‌హెచ్ యంగ్ క్రికెటర్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేందుకు రెడీగా అవుతున్నారు. ఎలానో? ఎందుకో తెలియాలంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
SRH, Nitish Kumar Reddy: ఫారెన్ ప్లేయర్లను ఎక్కువగా కొన్నారని విమర్శలు చేసిన వారికి ఎస్‌ఆర్‌హెచ్ యంగ్ క్రికెటర్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేందుకు రెడీగా అవుతున్నారు. ఎలానో? ఎందుకో తెలియాలంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
SNP
ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 22న సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో ఎలాగైన సత్తా చాటాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదలతో ఉంది. ఐపీఎల్ వేలం నుంచి కెప్టెన్ ఛేంజ్ వరకు అన్ని స్ట్రాటజిక్ స్టెప్స్ వేస్తూ.. పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. టీమ్‌లో ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారనే విమర్శ ఎస్‌ఆర్‌హెచ్‌పై ఉన్నా.. టీమ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లపై ఎంతో నమ్మకం పెట్టుకునే.. ఎక్కువ ఫారెన్ ప్లేయర్లను తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది.
ఐపీఎల్ వేలంలో ఎక్కువగా విదేశి ఆటగాళ్లనే తీసుకున్నారని, ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారనే రూల్‌ను బహుషా ఎస్‌ఆర్‌హెచ్ మర్చిపోయినట్లు ఉందని చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ప్లాన్ వేరేలా ఉంది. ఎందుకంటే టీమ్‌లో చాలా మంది యంగ్ టాలెంటెడ్ ఇండియన్ క్రికెటర్లు ఉన్నారు. వారిపై ఆమెకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కొంతమంది యువ క్రికెటర్లు. వారిలో ఒక యువ ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. అతనే నితీష్ కుమార్ రెడ్డి. ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ ఆడేందుకు అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్న ఈ కుర్రాడు.. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపుతున్నాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 9 బంతుల్లోనే 33 పరుగులు చేసి అదరగొట్టాడు.
భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ.. ఈ కుర్రాడు చూపిస్తున్న టెంపర్‌మెంట్‌కు ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. పైగా అతను షాట్లు ఆడే విధానం చూస్తూ.. మైండ్‌బ్లోయింగ్. ఆర్సీబీ మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతనికి కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా నితీష్ కుమార్‌రెడ్డి ఆల్‌రౌండర్ కావడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీస్ రెడ్డి ఆడిన ఓ రివర్స్ స్వీప్ షాట్ అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 566 పరుగులు, 52 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులు, 14 వికెట్లు సాధించాడు నితీష్ రెడ్డి. ఈ యంగ్ ఏబీడీ ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. మరి కొత్త ఏబీ డివిలియర్స్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నారు! వాడిని ఆపే మగాడు ఎవరు?
How good has been Nitish Kumar Reddy in these two games 🔥💪pic.twitter.com/KPuzh6W5e2#OrangeArmy #SRH #IPL2024
— Sunrisers Army (@srhorangearmy) March 18, 2024
With a stellar practice game display Nitish Kumar Reddy proves he’s an indispensable part of the SRH squad!pic.twitter.com/Nw3ijCcbT1
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 17, 2024