iDreamPost
android-app
ios-app

IPL 2024: SRH ఆటగాళ్లతో సూపర్ స్టార్ మహేశ్! ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు మైక్!

  • Published Apr 22, 2024 | 7:39 PM Updated Updated Apr 22, 2024 | 7:39 PM

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Apr 22, 2024 | 7:39 PMUpdated Apr 22, 2024 | 7:39 PM
IPL 2024: SRH ఆటగాళ్లతో సూపర్ స్టార్ మహేశ్! ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు మైక్!

సినిమా ఇండస్ట్రీకి, క్రికెట్ కు విడదీయరాని సంబంధం ఉందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది క్రికెటర్లు తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు చూసి.. ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. ఇక హీరోలు సైతం వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తూ.. వారి ఆటను ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే క్రికెటర్లు, హీరోలు కలుస్తూ ఉంటారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే అడ్వెంచరల్ యాక్షన్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కు వెళ్లనుంది. హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబును సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్లు మయాంక్ అగర్వాల్, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కలిశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మయాంక్ అగర్వాల్. దీంతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu

బహుశా సన్ రైజర్స్ కు సంబంధించిన యాడ్ షూట్ లో మహేశ్ పాల్గొని ఉండొచ్చని, లేదా వేరే యాడ్ షూటింగ్ లో భాగంగా వచ్చిన మహేశ్ ను కలిసి ఇలా ఫొటోలు దిగారని కొందరు రాసుకొస్తున్నారు. పిక్స్ చూస్తే మాత్రం యాడ్ షూట్ లో ఉన్న మహేశ్ ను మర్యాదపూర్వకంగానే వారు కలిసినట్లు తెలుస్తోంది. లేదా ఇంకేదైనా ఉందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. కాగా.. ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతోంది SRH. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రికార్డు స్కోర్లు నమోదు చేస్తూ.. ప్రత్యర్థి టీమ్స్ కు చుక్కలు చూపిస్తోంది. ఇక సన్ రైజర్స్ తన నెక్ట్స్ మ్యాచ్ ను ఆర్సీబీతో ఏప్రిల్ 25న తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş