iDreamPost
android-app
ios-app

IPL 2024లో SRH షెడ్యూల్‌ ఇదే! HYDలో ఎన్ని మ్యాచ్‌లంటే?

  • Published Feb 23, 2024 | 5:29 PM Updated Updated Feb 23, 2024 | 5:38 PM

SRH IPL 2024 Schedule: మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్‌ హంగామా మొదలుకానుంది. ఈ సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రానున్న సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఎప్పుడున్నాయి? ఏ టైమ్‌లో ఉన్నాయి? ఏ గ్రౌండ్‌లో ఉన్నాయి? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SRH IPL 2024 Schedule: మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్‌ హంగామా మొదలుకానుంది. ఈ సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రానున్న సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఎప్పుడున్నాయి? ఏ టైమ్‌లో ఉన్నాయి? ఏ గ్రౌండ్‌లో ఉన్నాయి? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 23, 2024 | 5:29 PMUpdated Feb 23, 2024 | 5:38 PM
IPL 2024లో SRH షెడ్యూల్‌ ఇదే! HYDలో ఎన్ని మ్యాచ్‌లంటే?

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండున్నర నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌తో ఇండియాను క్రికెట్‌ ఫీవర్‌ ఆవాహిస్తుంది. స్టార్‌ బ్యాటర్ల బాదుడు, బౌలర్ల మెరుపులు, ఫీల్డర్ల విన్యాసాలతో ఒక రకమైన ట్రాన్స్‌లోకి యువత వెళ్లిపోతుంది. అందుకే.. ఎండకాలం, వానాకాలం, చలికాలంలా.. ఇండియాలో ఐపీఎల్‌ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలమే మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు ఉండటంతో.. ఓ 21 మ్యాచ్‌లకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది ఐపీఎల్‌ కమిటీ. ఎన్నికల్‌ షెడ్యూల్‌ను బట్టి.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అయితే.. ఈ 21 మ్యాచ్‌ల్లో ప్రతి జట్టు కనీసం మూడు మ్యాచ్‌లు, గరిష్టంగా ఐదు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. మరి ఈ షార్ట్‌ షెడ్యూల్‌లో మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ఏ వేదికల్లో జరగనున్నాయి? అసలు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఉన్నాయా? లేవా? ఇలాంటి వివరాలన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. సెకండ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఇక మూడో మ్యాచ్‌తో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేట మొదలుకానుంది. మార్చ్‌ 23న ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. ఇక రెండో మ్యాచ్‌లో.. మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది సన్‌రైజర్స్‌. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7.30కే జరగనుంది.

మూడో మ్యాచ్‌ విషయానికివ వస్తే.. మార్చి 31న అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఈ షార్ట్‌ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ చివరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 5న ధోని టీమ్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌లోనే జరగనుంది. రాత్రి 7.30లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్‌లో ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌. రానున్న షెడ్యూల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడనుంది. పైగా ఈ సారి టీమ్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో.. సన్‌రైజర్స్‌ కప్పు కొడుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • మార్చి 23, SRH vs KKR (కోల్‌కత్తాలో) రాత్రి 7.30 గంటలకు
  • మార్చి 27, SRH vs MI (హైదరాబాద్‌లో) రాత్రి 7.30 గంటలకు
  • మార్చి 31, SRH vs Gt (అహ్మదాబాద్‌లో) మధ్యహ్నం 3.30 గంటలకు
  • ఏప్రిల్‌ 5, SRH vs CSK (హైదరాబాద్‌లో) రాత్రి 7.30 గంటలకు

marsbahis girişjojobetjojobet giriş