iDreamPost

IPL 2024 ఫైనల్లో ఓడినా.. సన్‌రైజర్స్‌కు దక్కిన భారీ ప్రైజ్‌మనీ! ఎంతంటే?

  • Published May 27, 2024 | 11:38 AMUpdated May 27, 2024 | 11:38 AM

SRH Prize Money, SRH vs KKR: ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడిపోయినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. అది ఎంతో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

SRH Prize Money, SRH vs KKR: ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడిపోయినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. అది ఎంతో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 27, 2024 | 11:38 AMUpdated May 27, 2024 | 11:38 AM
IPL 2024 ఫైనల్లో ఓడినా.. సన్‌రైజర్స్‌కు దక్కిన భారీ ప్రైజ్‌మనీ! ఎంతంటే?

క్రికెట్‌ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ వన్‌సైడ్‌గా జరిగింది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ మధ్య ఫైనల్‌ పోరు కావడంతో.. కచ్చితంగా టఫ్‌ ఫైట్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ, ఆదివారం చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. క్వాలిఫైయర్‌-1లో కేకేఆర్‌ చేతిలో ఓడినా.. క్వాలిఫైయర్‌-2లో రాజస్థాన్‌పై గెలిచి.. ఫైనల్‌ ఫైట్‌కు అర్హత సాధించింది సన్‌రైజర్స్‌. కానీ, ఫైనల్లో దారుణంగా విఫలమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని.. బొక్కబోర్లా పడింది. మ్యాచ్‌ ఆసాంతం పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్‌ 8 వికెట్లతో తేడాతో గెలిచి.. ముచ్చటగా మూడో సారి ఛాంపియన్‌గా నిలిచింది. భారీ ప్రైజ్‌మనీ కూడా సొంతం చేసుకుంది. ఇక ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌కు కూడా భారీ ప్రైజ్‌మనీ దక్కింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

టోర్నీ ఆసాంతం ఎంతో అద్భుతంగా ఆడి, ఒకానొక దశలో ప్రత్యర్థి జట్లను తమ భీకర బ్యాటింగ్‌తో వణికించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ ఫైనల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. చెత్త బ్యాటింగ్‌తో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఈ టార్గెట్‌ను కాపాడుకోవడం అంత ఈజీ కాకపోయినా.. బౌలర్లు కూడా పెద్దగా ప్రయత్నించకుండానే.. కేకేఆర్‌ చేతుల్లో కప్పు పెట్టేశారు. అయితే.. సీజన్‌ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చి.. ప్లే ఆఫ్స్‌లో క్వాలిఫైయర్‌-, క్వాలిఫైయర్‌-2 ఆడి.. ఫైనల్‌ వరకు వచ్చిన రన్నరప్‌గా నిలిచిన ఎస​ఆర్‌హెచ్‌కు రూ.12.50 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కింది. ఈ ప్రైజ్‌మనీని బీసీసీఐ ఛైర్మన్‌ బిన్నీ, సెక్రటరీ జైషా అందించారు. అలాగే ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందించారు.

వీరితో పాటు.. ప్లే ఆఫ్స్‌కు వచ్చిన రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కూడా ప్రైజ్‌మనీ దక్కింది. ప్లే ఆఫ్స్‌కు చేరి ఎలిమినేటర్‌ ఆడిన ఆర్సీబీకి రూ.6.5 కోట్ల ప్రైజ్‌మనీ అందించారు. అలాగే ఎలిమినేటర్‌ గెలిచి, క్వాలిఫైయర్‌-2 ఆడిన ఆర్‌ఆర్‌కు రూ.7 కోట్లు అందించారు. ఇక ప్లేయర్‌ వారిగా చూసుకుంటే.. ఈ సీజన్‌లో 741 పరుగులు చేసి టాప్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న విరాట్‌ కోహ్లీకి రూ.10 లక్షలు, 24 వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌కు రూ.10 లక్షలు అందుతాయి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ప్లేయర్‌కు రూ.20 లక్షలు, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు గెలిచిన క్రికెటర్‌కు రూ. 12 లక్షలు ఇవ్వనున్నారు. మరి రన్నరప్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు దక్కిన ప్రైజ్‌మనీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి