లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ బ్యాటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లు గొడవపడ్డారు. ఈ ఘర్షణ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవపై తాజాగా స్పందించాడు శ్రీశాంత్.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ బ్యాటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లు గొడవపడ్డారు. ఈ ఘర్షణ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవపై తాజాగా స్పందించాడు శ్రీశాంత్.
క్రికెట్ మ్యాచ్ ల్లో గొడవలు జరగడం సాధారణమే. అయితే ఆటగాళ్లు పదే పదే వివాదాల్లో చిక్కుకోవడం అన్నది ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఇద్దరు టీమిండియా మాజీ ఆటగాళ్ల ఫ్యాన్స్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. గౌతమ్ గంభీర్-శ్రీశాంత్.. గతంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి, ఎన్నో విజయాలను జట్టుకు అందించిన వారే. ఇక వీరి ఆటతీరుతో పాటుగా యాటిట్యూడ్, అగ్రెసివ్ నెస్ తో తరచుగా వివాదాల్లో నిలుస్తూ.. ఉండేవారు. తాజాగా మరోసారి వీరిద్దరూ గొడవపడి కొట్టుకునేదాక పోయిన విషయం తెలిసిందే. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరు గొడవపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది కూడా. కాగా.. ఈ గొడవపై స్పందించాడు శ్రీశాంత్. గంభీర్ నన్ను బూతులు తిట్టాడని వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు ఈ మాజీ ఆటగాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ జట్టుకు గంభీర్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. గుజరాత్ టీమ్ కు ఆడుతున్నాడు శ్రీశాంత్. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఏకంగా కొట్టుకునేదాక పోయారు. దీంతో అంపైర్లు, సహచర ఆటగాళ్లు ఇద్దరి ఆపేందుకు ప్రయత్నం చేశారు. కాగా.. ఇటు గంభీర్, అటు శ్రీశాంత్ అగ్రెసివ్ నెస్ ఉన్న ఆటగాళ్లే కావడంతో.. వారిని ఆపడం ఇతర ప్లేయర్లకు కష్టతరమైంది. ఇక ఈ గొడవపై వీడియో ద్వారా స్పందించాడు శ్రీశాంత్. ఈ గొడవ గురించి కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాడు.
శ్రీశాంత్ మాట్లాడుతూ..”ఈ సంఘటన గురించి ఎంతో మంది సెలబ్రిటీలు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. పైగా కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. అందుకే నేను ఈ వీడియో ద్వారా జరిగింది చెప్పడానికి వచ్చాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను గంభీర్ ను ఒక్కమాట కూడా అనలేదు. అతడే నన్ను ‘ఫిక్సర్’ అని పదే పదే పిలవడంతో పాటుగా అసభ్యకర రీతిలో బూతులు తిట్టాడు. దీంతో నేను నువ్వేం మాట్లాడుతున్నావ్.. నువ్వే మాట్లాడుతున్నావ్ అంటూ నవ్వానే తప్ప ఒక్క బూతు మాటకూడా అనలేదు. అంపైర్లు అతడిని ఆపడానికి ట్రై చేస్తున్నా.. పదే పదే అదే మాటను అతడు అంటున్నాడు” అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. కాగా.. అతడికి డబ్బు, అధికారం ఉంటే ఉండొచ్చు.. అంతమాత్రాన ఇలా ప్రవర్తించడం సరైంది కాదని శ్రీశాంత్ పేర్కొన్నాడు. నాకు నా కుటుంబ సభ్యులు, మీ సహకారంతో నేను ఇక్కడ ఉన్నాను అంటూ తెలిపాడు. మరి ఈ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
S Sreesanth on Gautam Gambhir:
“He kept calling me a fixer”.pic.twitter.com/qPtSdEXTjp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023