iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ గెలిపిస్తే.. పాండ్యా విషయంలో గంభీర్ ఏంటి ఇలా చేశాడు?

Squads For Sri Lanka Tour 2024- Hardik Pandya: శ్రీలంక టూర్ కి బీసీసీఐ టీ20 సిరీస్, వన్డే సిరీస్ కి సంబంధించి జట్లను ప్రకటించింది. టీ20 కెప్టెన్ గా అందరూ అనుకున్నట్లే సూర్య కుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు. మరో విషయంలో కూడా హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగింది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Squads For Sri Lanka Tour 2024- Hardik Pandya: శ్రీలంక టూర్ కి బీసీసీఐ టీ20 సిరీస్, వన్డే సిరీస్ కి సంబంధించి జట్లను ప్రకటించింది. టీ20 కెప్టెన్ గా అందరూ అనుకున్నట్లే సూర్య కుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు. మరో విషయంలో కూడా హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగింది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

వరల్డ్ కప్ గెలిపిస్తే.. పాండ్యా విషయంలో గంభీర్ ఏంటి ఇలా చేశాడు?

టీమిండియా శ్రీలంక టూర్ కి వెళ్తున్న విషయం తెలిసిందే. జులై 27 నుంచి ఈ టూర్ స్టార్ట్ కాబోతోంది. ఈ టూర్ లో మొత్తం 3 టీ20 మ్యాచులు, 3 వన్డే మ్యాచుల్లో టీమిండియా జట్టు.. శ్రీలంకతో తలపడనుంది. ఈ సిరీస్ కి సంబంధించి తాజాగా జట్లను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు ఈ టీమ్స్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే గంభీర్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అని అందరికీ అర్థమవుతోంది. హెడ్ కోచ్ గా తన వ్యూహాలను స్టార్ట్ చేశాడు. ఎందుకంటే టీమిండియా టీ20 గెలవడంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం అన్యాయం చేశాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ ఇవ్వరు అని ముందే తెలుసు కానీ.. ఇలా చేస్తారు అనుకోలేదు అంటున్నారు.

శ్రీలంక టూర్ కి సంబంధించి వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉండలేను అని హార్దిక్ పాండ్యా బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అందుకు తగినట్లుగానే అతడిని వన్డే సిరీస్ కు సెలక్ట్ చేయలేదు. ఇంక టీ20 సిరీస్ కి సంబంధించి హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాదు అనే విషయం నాలుగు రోజుల నుంచి అందరూ మాట్లాడుకుంటున్నదే. అయితే ఇలా వైస్ కెప్టెన్సీ కూడా తీసేస్తారు అని ఎవరూ ఊహించలేదు. అతనికి ఉన్న వైస్ కెప్టెన్సీని తీసేసి ఆ స్థానంలోకి శుభ్ మన్ గిల్ ని వైస్ కెప్టెన్ గా తీసుకున్నారు. అయితే పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి అతని బిహేవియర్ కారణం కావచ్చు అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. అయితే వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకపోవడం దారుణంగా అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు శుభ్ మన్ గిల్ కి కూడా ఒక పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది. ఎందుకంటే.. గిల్ కి టీ20 కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయి అనే కొందరు అనుకున్నారు. కానీ, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా చేసి.. గిల్ ని మాత్రం వైస్ కెప్టెన్సీకి పరిమితం చేశారు. అటు వన్డేలకు కూడా గిల్ ని వైస్ కెప్టెన్ ని చేశారు. ఇంక వన్డేలకు కెప్టెన్ గా రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నాడు. అలాగే కోహ్లీ కూడా టీమ్ లో ఉన్నాడు. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, రవి భిష్ణోయ్, రియాన్ పరాగ్ లు టీమ్స్ లోకి వచ్చారు. ఈ టూర్ తొలుత టీ20 సిరీస్ తో స్టార్ట్ అవుతుంది. మూడు టీ20లు పల్లెకేలే స్టేడియంలో జరుగుతాయి. జులై 27, 28, 30న టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత కొలంబో వేదికగా ఆగస్టు 2, ఆగస్టు 4, ఆగస్టు 7న వన్డే మ్యాచులు నిర్వహిస్తారు.

టీ20 సిరీస్ స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వేస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకు సింగ్, సంజూ శాంసన్ (కీపర్), రిషబ్ పంత్ (కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ ధూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి భిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

వన్డే సిరీస్ స్క్వాడ్:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), కేఎల్ రాహుల్(కీపర్), శివమ్ ధూబే, కుల్దీప్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి