iDreamPost

నీ బతుక్కి కోహ్లీతో పోలికా..? బాబర్‌ ఆజమ్‌ పరువుతీసిన ఇంటర్నేషనల్‌ సెలబ్రెటీ!

  • Published Jun 08, 2024 | 1:31 PMUpdated Jun 08, 2024 | 1:31 PM

Speede, Babar Azam, Virat Kohli, T20 World Cup 2024, PAK vs USA: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను ఓ ఇంటర్నేషనల్‌ సెలబ్రెటీ దారుణంగా ట్రోల్‌ చేశాడు. అతను ఎవరు ఏం అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Speede, Babar Azam, Virat Kohli, T20 World Cup 2024, PAK vs USA: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను ఓ ఇంటర్నేషనల్‌ సెలబ్రెటీ దారుణంగా ట్రోల్‌ చేశాడు. అతను ఎవరు ఏం అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 08, 2024 | 1:31 PMUpdated Jun 08, 2024 | 1:31 PM
నీ బతుక్కి కోహ్లీతో పోలికా..? బాబర్‌ ఆజమ్‌ పరువుతీసిన ఇంటర్నేషనల్‌ సెలబ్రెటీ!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అమెరికా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్‌పై విమర్శల వర్షం ఇంకా తగ్గడం లేదు. పాక్‌ టీమ్‌తో పాటు ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌పై కూడా సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. తాజాగా సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలో చెలామణి అవుతున్న స్పీడీ అనే వ్యక్తి తాజాగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పరువుతీసేలా మాట్లాడాడు. అమెరికాతో మ్యాచ్‌ ఓటమి తర్వాత.. బాబర్‌ ఆజమ్‌ ఈజ్‌ ఇన్‌ డర్ట్‌ అంటూ పేర్కొన్నాడు. అమెరికాపై మ్యాచ్‌ గెలవలేవు.. నువ్వు ఎలా కోహ్లీ అవుతానని అనుకుంటున్నావ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 సమయంలో ఇండియాకు వచ్చిన ఈ స్పీడీ అనే కుర్రాడు ముంబై వీధుల్లో పర్యటిస్తూ హల్చల్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బాబర్‌ ఆజమ్‌ గురించి మాట్లాడి అతని పరువుతీశాడు. అయితే.. ఇదే విషయంపై సోషల్‌ మీడియాలో కొంతమంది క్రికెట్‌ అభిమానులు బాబర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాపై కూడా మ్యాచ్‌ గెలవలేని టీమ్‌కు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అని, స్లో బ్యాటింగ్‌తో అమెరికాపై పాక్‌ను ఓడించే బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి క్రికెటర్‌ను విరాట్‌ కోహ్లీతో ఎలా పోలుస్తారంటూ తిట్టిపోస్తున్నారు. బాబర్‌ ఆజమ్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో అతన్ని విరాట్‌ కోహ్లీతో పోల్చేవారు. కానీ, దాన్ని పాక్‌ మాజీ క్రికెటర్లే చాలా మంది ఖండించారు. కోహ్లీ గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అని, కోహ్లీ సాధించిన దానిలో 30 శాతం కూడా బాబర్‌ సాధించలేదని.. అలాంటి బాబర్‌ను కోహ్లీతో పోల్చడం సరికాదని అన్నారు.

ఇప్పుడు అమెరికాపై పాకిస్థాన్‌ ఓడిపోవడం, ఆ ఓటమికి బాబర్‌ ఆజమ్‌ ఆడిన స్లో ఇన్నింగ్స్‌ కారణం అంటూ విమర్శలు రావడంతో.. నీ బతుక్కి కోహ్లీతో పోలికా అంటూ బాబర్‌ ఆజమ్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. ఇలా ట్రోల్‌ చేస్తున్న వారిలో పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు కూడా ఉండటం గమనార్హం. ఆ దేశ క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా పాక్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అసోసియేట్‌ టీమ్‌గా ఉన్న అమెరికాపై ఓటమిని పాక్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి బాబర్‌పై స్పీడీ చేసిన కామెంట్‌తో పాటు, అతనిపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి