iDreamPost
android-app
ios-app

29 బంతుల్లోనే సెంచరీ! AB డివిలియర్స్‌ రికార్డు బ్రేక్‌

  • Published Oct 08, 2023 | 1:34 PMUpdated Oct 08, 2023 | 1:34 PM
  • Published Oct 08, 2023 | 1:34 PMUpdated Oct 08, 2023 | 1:34 PM
29 బంతుల్లోనే సెంచరీ! AB డివిలియర్స్‌ రికార్డు బ్రేక్‌

క్రికెట్‌ ప్రపంచంలో విధ్వంసపు బ్యాటింగ్‌కు చిరునామా ఎవరంటే.. ఏబీ డివిలియర్స్‌. ఈ సౌతాఫ్రికా స్టార్‌కు మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ అనే పేరు కూడా ఉంది. అయితే.. డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు కూడా పలు అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌పై డివిలియర్స్‌ బాదిన 31 బంతుల్లో సెంచరీ ఇప్పటికీ చెక్కు చెదరిని రికార్డుగానే ఉంది. అయితే.. రికార్డును ఓ ఆస్ట్రేలియా బ్యాటర్‌ బద్దలు కొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.

సౌత్‌ ఆస్ట్రేలియాకు చెందని 21 ఏళ్ల బ్యాటర్‌ జేక్ ఫ్రేజర్.. అడిలైడ్‌లోని కరెన్ రోల్టన్ ఓవల్‌లో టాస్మానియాపై 29 బంతుల్లో సెంచరీ బాదేశాడు. మొత్తం 38 బంతుల్లో 128 పరుగులు చేశాడు ప్రేజర్‌. ఓ ఓవర్‌లో అయితే ఏకంగా 4 సిక్సులు, 2 ఫోర్లతో 32 పరుగులు రాబట్టాడు. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకుని.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. అయితే.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీతో ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ రికార్డును బ్రేక్‌ చేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో ఫ్రేజర్ ఇంతకుముందు 13 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 50 పరుగులు చేశాడు. ఇది తనకు మొదటి సెంచరీ. ఫ్రేజర్‌ సునామీ ఇన్నింగ్స్‌తో ఇద్దరు స్టార్ ప్లేయర్‌ రికార్డులు బద్దుల కావడం విశేషం. ఏబీ డివిలియర్స్‌ది అంతర్జాతీయ రికార్డు అయినప్పటికీ.. అనధికారికంగా అది బ్రేక్‌ అయినట్లే. ఇక దేశవాళీ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మాత్రం అఫిషీయల్‌గా బ్రేక్‌ అయింది. మరి ఫ్రేజర్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 2007 వరల్డ్‌ కప్‌ డిజాస్టర్‌పై ద్రవిడ్‌ ఎమోషనల్ రియాక్షన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి