iDreamPost
android-app
ios-app

ENG VS SA: ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన సఫారీలు! వరల్డ్ కప్ లోనే పెద్ద విక్టరీ

  • Published Oct 21, 2023 | 9:48 PM Updated Updated Oct 21, 2023 | 9:48 PM

వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తుండగా ఈ రోజు రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ లోనే భారీ విజయం నమోదైంది.

వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తుండగా ఈ రోజు రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ లోనే భారీ విజయం నమోదైంది.

  • Published Oct 21, 2023 | 9:48 PMUpdated Oct 21, 2023 | 9:48 PM
ENG VS SA: ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన సఫారీలు! వరల్డ్ కప్ లోనే పెద్ద విక్టరీ

వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తుండగా ఈ రోజు రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ లోనే భారీ విజయం నమోదైంది. ప్రపంచ కప్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన హోరాహోరి పోరులో సఫారీలు ఇంగ్లీష్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించారు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

క్లాసెన్, హెన్డ్రిక్స్, డస్సెన్ మెరుపు బ్యాటింగ్ తో భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో క్లాసెన్ సెంచరీతో మెరిసాడు. సఫారీల బ్యాటింగ్ ముందు ఇంగ్లడ్ బౌలర్లు తేలిపోయారు. సఫారీల వికెట్లు తీసేందుకు ప్రసవ వేదన పడ్డారు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 399 భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టుకు సఫారీలు ఊహించని షాక్ ఇచ్చారు. బ్యాటింగ్ తో అదరగొట్టిన సౌతాఫ్రికా బౌలింగ్ లోను మెరుగైన ప్రదర్శన చేసింది.

ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టింది. కీలక వికెట్లను పడగొడుతూ కోలుకోలేని దెబ్బ తీసింది సౌతాఫ్రికా. దీంతో కేవలం 22 ఓవర్లకే చేతులెత్తేసింది ఇంగ్లీష్ జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారి వరల్డ్ కప్ లో దారుణంగా విఫలమవుతోంది. మొన్న పసికూన చేతిలో ఘోర పరాజయం పాలైన ఇంగ్లీష్ జట్టు తాజాగా సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీ జట్టు నిర్దేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కేవలం 170 రన్స్ కే ఆలౌటైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఈ వరల్డ్ కప్ లో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş