Nidhan
South Africa vs West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు.
South Africa vs West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు.
Nidhan
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు. ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, తెంబా బవుమా, టోనీ డీజార్జి లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్న టీమ్‌ను విండీస్ బౌలర్లు భయపెడుతున్నారు. ఒక్కో పరుగు కోసం చెమటోడ్చేలా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రొటీస్ టీమ్‌తో ఆతిథ్య జట్టు ఆడుకుంటోంది. వెస్టిండీస్ బౌలర్లు సఫారీ బ్యాటర్లను వణికిస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యంగ్ పేసర్ షమార్ జోసఫ్ చేసిన పనిని రెండో ఇనింగ్స్‌లో మరో కుర్ర బౌలర్ జేడెన్ సీల్స్ రిపీట్ చేశాడు.
22 ఏళ్ల జేడెన్ సీల్స్ లీథల్ పేస్‌తో సౌతాఫ్రికా పని పట్టాడు. మంచి పేస్‌తో పాటు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఒక్కసారి రిథమ్ అందుకున్నాక బాల్‌ను ఇరువైపులా స్వింగ్ చేస్తూ, బ్యాటర్ల వీక్నెస్ మీద దెబ్బకొడుతూ బౌలింగ్ చేశాడు. దీంతో బంతిని టచ్ చేయాలన్నా సౌతాఫ్రికా బ్యాటర్స్ భయపడ్డారు. బాల్ టచ్ చేస్తే ఎడ్జ్ తీసుకొని కీపర్ లేదా స్లిప్స్‌లో క్యాచ్‌కు వెళ్లడం, వదిలేస్తే ఎల్బీడబ్ల్యూ లేదా క్లీన్‌బౌల్డ్ అయ్యే ప్రమాదం ఉండటంతో క్రీజులో ఉండాలంటేనే వణికిపోయారు. తెలివిగా బౌలింగ్ చేస్తూ పోయిన సీల్స్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ టోనీతో పాటు ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ బవుమా, డేవిడ్ బెడింగ్‌హామ్‌ను అతడు ఔట్ చేశాడు.
వికెట్ కీపర్ కైల్ వెరీన్ను కూడా సీల్స్ వెనక్కి పంపించాడు. అతడి దెబ్బకు ఒక దశలో 120/2తో భారీ స్కోరు దిశగా సాగుతున్న సౌతాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్స్‌ను వరుస విరామాల్లో ఔట్ చేస్తూ పర్యాటక టీమ్‌ను చావుదెబ్బ తీశాడు సీల్స్. అతడితో పాటు గుడకేష్ మోతీ, జోమెల్ వెరికన్ చెరో 2 వికెట్లతో రాణించారు. ఇప్పుడు నాలుగో ఇన్నింగ్స్ నడుస్తోంది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 31 పరుగులతో ఉన్న విండీస్ గెలవాంటే మరో 232 పరుగులు చేయాలి. అయితే సఫారీ పేస్ అటాక్ కగిసో రబాడ, నాండ్రే బర్గర్‌ను తట్టుకొని వాళ్లు నిలబడటం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఛేజ్ పూర్తి చేస్తే మాత్రం సంచలనమే. విండీస్ గెలిస్తే ఆ క్రెడిట్ యంగ్ పేసర్స్ షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్కు ఇవ్వాల్సిందే.
22 year old Jayden Seales has picked up a five wicket haul. pic.twitter.com/T7WLhPc0Mh
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 17, 2024