iDreamPost
android-app
ios-app

వీడియో: సౌతాఫ్రికాను వణికించిన విండీస్ పేసర్.. భయపెట్టి ఔట్ చేశాడు!

  • Published Aug 17, 2024 | 10:10 PM Updated Updated Aug 17, 2024 | 10:10 PM

South Africa vs West Indies: వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు.

South Africa vs West Indies: వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు.

  • Published Aug 17, 2024 | 10:10 PMUpdated Aug 17, 2024 | 10:10 PM
వీడియో: సౌతాఫ్రికాను వణికించిన విండీస్ పేసర్.. భయపెట్టి ఔట్ చేశాడు!

వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరీబియన్ బౌలర్లు సఫారీ బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు. ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, తెంబా బవుమా, టోనీ డీజార్జి లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్న టీమ్​ను విండీస్ బౌలర్లు భయపెడుతున్నారు. ఒక్కో పరుగు కోసం చెమటోడ్చేలా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రొటీస్ టీమ్​తో ఆతిథ్య జట్టు ఆడుకుంటోంది. వెస్టిండీస్ బౌలర్లు సఫారీ బ్యాటర్లను వణికిస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో యంగ్ పేసర్ షమార్ జోసఫ్ చేసిన పనిని రెండో ఇనింగ్స్​లో మరో కుర్ర బౌలర్ జేడెన్ సీల్స్ రిపీట్ చేశాడు.

22 ఏళ్ల జేడెన్ సీల్స్ లీథల్ పేస్​తో సౌతాఫ్రికా పని పట్టాడు. మంచి పేస్​తో పాటు సరైన లైన్ అండ్ లెంగ్త్​లో బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఒక్కసారి రిథమ్ అందుకున్నాక బాల్​ను ఇరువైపులా స్వింగ్ చేస్తూ, బ్యాటర్ల వీక్​నెస్​ మీద దెబ్బకొడుతూ బౌలింగ్ చేశాడు. దీంతో బంతిని టచ్ చేయాలన్నా సౌతాఫ్రికా బ్యాటర్స్ భయపడ్డారు. బాల్ టచ్ చేస్తే ఎడ్జ్ తీసుకొని కీపర్ లేదా స్లిప్స్​లో క్యాచ్​కు వెళ్లడం, వదిలేస్తే ఎల్​బీడబ్ల్యూ లేదా క్లీన్​బౌల్డ్ అయ్యే ప్రమాదం ఉండటంతో క్రీజులో ఉండాలంటేనే వణికిపోయారు. తెలివిగా బౌలింగ్ చేస్తూ పోయిన సీల్స్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ టోనీతో పాటు ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ బవుమా, డేవిడ్ బెడింగ్​హామ్​ను అతడు ఔట్ చేశాడు.

వికెట్ కీపర్ కైల్ వెరీన్​ను కూడా సీల్స్ వెనక్కి పంపించాడు. అతడి దెబ్బకు ఒక దశలో 120/2తో భారీ స్కోరు దిశగా సాగుతున్న సౌతాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్​తో పాటు మిడిలార్డర్ బ్యాటర్స్​ను వరుస విరామాల్లో ఔట్ చేస్తూ పర్యాటక టీమ్​ను చావుదెబ్బ తీశాడు సీల్స్. అతడితో పాటు గుడకేష్ మోతీ, జోమెల్ వెరికన్ చెరో 2 వికెట్లతో రాణించారు. ఇప్పుడు నాలుగో ఇన్నింగ్స్ నడుస్తోంది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 31 పరుగులతో ఉన్న విండీస్ గెలవాంటే మరో 232 పరుగులు చేయాలి. అయితే సఫారీ పేస్ అటాక్ కగిసో రబాడ, నాండ్రే బర్గర్​ను తట్టుకొని వాళ్లు నిలబడటం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఛేజ్ పూర్తి చేస్తే మాత్రం సంచలనమే. విండీస్ గెలిస్తే ఆ క్రెడిట్ యంగ్ పేసర్స్ షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్​కు ఇవ్వాల్సిందే.