iDreamPost
android-app
ios-app

నటుడి కుమారుడికి షమీ క్రికెట్‌ కోచింగ్‌.. వీడియో వైరల్‌

  • Published Nov 19, 2023 | 2:21 PM Updated Updated Nov 19, 2023 | 2:21 PM

న్యూజిలాండ్‌తో సెమి ఫైనల్‌ సందర్భంగా ఏడు వికెట్లు తీసి.. దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు షమీ. ఈ క్రమంలో తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వివరాలు..

న్యూజిలాండ్‌తో సెమి ఫైనల్‌ సందర్భంగా ఏడు వికెట్లు తీసి.. దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు షమీ. ఈ క్రమంలో తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వివరాలు..

  • Published Nov 19, 2023 | 2:21 PMUpdated Nov 19, 2023 | 2:21 PM
నటుడి కుమారుడికి షమీ క్రికెట్‌ కోచింగ్‌.. వీడియో వైరల్‌

నవంబర్‌ 19.. సామాన్యులకు పెద్దగా ప్రత్యేకం కాకపోవచ్చు.. కానీ క్రికెట్‌ అభిమానులు మాత్రం ఈ రోజును ఎన్నటికి మర్చిపోలేరు. అసలు ఈ ఆదివారం కోసం వారు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన వన్డే క్రికెట్‌ వరల్ట్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేడు జరుగుతుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నేడు కప్పు కోసం బరిలోకి దిగుతున్నాయి. ఇక నేటి మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు మాత్రమే కాక 130 కోట్ల మంది భారతీయులతో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అహ్మాదాబాద్‌ మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు నరేంద్ర మోదీతో పాటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులో ఏడు వికెట్లతో దుమ్మురేపి వార్తల్లో నిలిచాడు షమీ. ఇక తాజాగా స్టార్‌ క్రికెటర్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ నటుడి కొడుక్కి.. షమీ క్రికెట్‌లో కోచింగ్‌ ఇస్తున్నాడు. ఆ వివరాలు..

ప్రముఖ నటుడు సోనూసూద్‌ కుమారుడికి షమీ క్రికెట్‌ పాఠాలు చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్‌ షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. షమీ తన చిన్న కుమారుడు అయాన్‌కు బ్యాటింగ్ మెలకువలు నేర్పుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ వరల్డ్‌ కప్‌లో వికెట్లతో అదరగొడుతున్న షమీ.. సోనూసూద్‌ కొడుక్కి క్రికెట్‌ పాఠలు చెప్పడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌కు షమీ ప్రస్తుతం చిట్కాలు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియో పాతది. షమీ.. సోనూసూద్‌ కొడుకు అయాన్‌కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక కరోనా సమయంలో తన సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్‌. నేటికి కూడా ఎందరో సోషల్‌ మీడియా వేదికగా ఆయనను సాయం కోరుతుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనూ కన్నడ చిత్రం ‘శ్రీమంత’లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఫతే’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన ‘ఫతే’ మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet