Tom Banton: వీడియో: నొప్పితో తల్లడిల్లుతూనే రివర్స్‌ స్విప్‌.. నీ తెగువకు హ్యాట్సాఫ్!

Tom Banton came into bat an ankle injury: కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా సర్రేతో జరిగిన మ్యాచ్ లో సోమర్ సెట్ ప్లేయర్ టామ్ బాంటన్ చూపిన తెగువకు క్రికెట్ లవర్స్ ఫిదా అవుతున్నారు. నొప్పితో తల్లడిల్లుతూనే అతడు బ్యాటింగ్ కొనసాగించిన తీరు అద్భుతం.

Tom Banton came into bat an ankle injury: కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా సర్రేతో జరిగిన మ్యాచ్ లో సోమర్ సెట్ ప్లేయర్ టామ్ బాంటన్ చూపిన తెగువకు క్రికెట్ లవర్స్ ఫిదా అవుతున్నారు. నొప్పితో తల్లడిల్లుతూనే అతడు బ్యాటింగ్ కొనసాగించిన తీరు అద్భుతం.

కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ లో భాగంగా సోమర్ సెట్ వర్సెస్ సర్రే జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సోమర్ సెట్ 153 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో గాయపడిన ఓ బ్యాటర్ కుంటుతూనే గ్రౌండ్ లోకి బ్యాట్ పట్టుకుని బయలుదేరాడు. చీల మండల గాయంతో బాధపడుతున్న అతడు.. అసలు బ్యాటింగ్ కు దిగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ.. నొప్పితో తల్లడిల్లుతూనే క్రీజ్ లోకి వచ్చాడు టామ్ బాంటన్. ఇంజ్యూరీ అయ్యాడు కదా.. ఏం ఆడుతాడులే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు చెలరేగిపోయాడు, తన జట్టును కాపాడాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టామ్ బాంటన్.. ప్రస్తుతం ఈ ఆటగాడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. దానికి కారణం.. అతడు చూపిన తెగువే. కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ వన్ 2024లో భాగంగా సోమర్ సెట్ వర్సెస్ సర్రే మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఓ ఆసక్తికర సంఘటన నమోదు అయ్యింది. సర్రే బౌలర్ల ధాటికి సోమర్ సెట్ 153 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఆ జట్టుకు 149 పరుగుల ఆధిక్యం ఉంది. ఈ క్రమంలో చీల మండల గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న టామ్ బాంటన్ బ్యాటింగ్ కు వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ.. అనూహ్యంగా అతడు కుంటుకుంటూనే బ్యాటింగ్ కు దిగాడు. తన జట్టును ఆదుకునేందుకు గాయాన్ని సైతం లెక్కచేయలేదు ఈ ఆటగాడు. బ్యాటింగ్ కు దిగడమే కాదు.. ఏకంగా 4 ఫోర్లతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు కొట్టిన రివర్స్ స్వీప్ హైలెట్ అని చెప్పాలి.

ఇక మరో ఎండ్ లో ఉన్న జాక్ లీచ్(13*)తో కలిసి చివరి వికెట్ కు 41 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు బాంటన్. దాంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లకు 194 రన్స్ తో నిలిచి.. 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది సోమర్ సెట్. కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉదయం.. టామ్ బాంటన్ ఫుట్ బాల్ ఆడుతూ గాయపడ్డాడని, అందుకే అతడు గ్రౌండ్ లోకి రాలేదని, ఇక అతడికి స్కాన్ చేసి పరిస్థితిని తెలియజేస్తామని సోమర్ సెట్ క్రికెట్ డైరెక్టర్ ఆండీ హుర్రీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టామ్ బాంటన్ నొప్పితో తల్లడిల్లుతూనే ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో జట్టును ఆదుకునేందుకు అతడు చూపిన తెగువకు హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు, క్రికెట్ లవర్స్. మరి గాయంతోనే బ్యాటింగ్ చేసి, మనసులు గెలుచుకున్న టామ్ బాంటన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments