iDreamPost
android-app
ios-app

దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన పసికూన కెప్టెన్!

  • Published Jan 16, 2024 | 3:25 PM Updated Updated Jan 16, 2024 | 3:25 PM

మహామహులైన దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.

మహామహులైన దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.

దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన పసికూన కెప్టెన్!

ప్రపంచంలో ఎందరో దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. ఇక వారు ఎన్నో వరల్డ్ రికార్డులను తమ పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు కూడా. అయితే ఎందరో మహామహులైన దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనతను సాధించాడు పసికూన జట్టైన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. గేల్, ఏబీడీ, విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి ఎందరో విధ్వంసకర వీరులున్న క్రికెట్ ప్రపంచంలో.. వారు సాధించలేని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు సికిందర్ రజా. మరి ఆ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

సికిందర్ రజా.. ప్రపంచ క్రికెట్ లో ఉన్న స్టార్ ఆల్ రౌండర్స్ లో అగ్రశ్రేణి ప్లేయర్. తన బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తించగల ఆటగాడు. జింబాబ్వే కెప్టెన్ గా జట్టుకు వెన్నముకగా ఉంటూ.. ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న రజా.. బౌలింగ్ తో బ్యాటింగ్ తో జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 62 రన్స్ తో రాణించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు సికిందర్ రజా. మహామహులైన దిగ్గజ క్రికెటర్లు కూడా సాధించలేని చరిత్రను సృష్టించాడు ఈ పసికూన కెప్టెన్. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సికిందర్ రజా గత ఐదు ఇన్నింగ్స్ ల్లో వరుసగా.. రువాండాపై 58, నైజీరియా 65, కెన్యా 82, ఐర్లాండ్ పై 65 పరుగులు చేశాడు. తాజాగా లంకతో మ్యాచ్ లో కూడా 62 రన్స్ చేయడంతో.. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెక్ కల్లమ్, క్రిస్ గేల్, రీజా హెండ్రిక్స్ తలా నాలుగు అర్ధ శతకాలతో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఒక్క టీమిండియా ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. అదీకాక ఈ ఐదు మ్యాచ్ ల్లో ప్రతీ మ్యాచ్ లో రెండు వికెట్లకు పైగా పడగొట్టాడు సికిందర్ రజా. మరి దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్న సికిందర్ రజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.