iDreamPost
android-app
ios-app

Swetha Sehrawat: లేడీ సెహ్వాగ్.. 31 ఫోర్లు.. 7 సిక్సర్లతో భారీ విధ్వంసం

శ్వేతా సెహ్రావత్ ఉమెన్ క్రికెట్ లో సంచలనానికి తెరలేపింది. ఏకంగా 31 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం సృష్టించింది.

శ్వేతా సెహ్రావత్ ఉమెన్ క్రికెట్ లో సంచలనానికి తెరలేపింది. ఏకంగా 31 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం సృష్టించింది.

Swetha Sehrawat: లేడీ సెహ్వాగ్.. 31 ఫోర్లు.. 7 సిక్సర్లతో భారీ విధ్వంసం

టీమిండియా క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ అనగానే అందరూ టక్కున సెహ్వాగ్ పేరే చెప్తారు. మైదానంలోకి దిగింది మొదలు ఫోర్లు, సిక్సర్లతో సెహ్వాగ్ విధ్వంసం సృష్టిస్తాడు. వీరూకి బౌలింగ్ చేయాలి అంటే ఎంతటి బడా బౌలర్ కి అయినా వణుకుపుట్టాల్సిందే. సెహ్వాగ్ వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కు అలాంటి మెరుపులు కరువయ్యాయనే చెప్పాలి. అయితే టీమిండియా ఉమెన్ టీమ్ లో ఒక లేడీ సెహ్వాగ్ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె మరెవరో కాదు.. శ్వేతా సెహ్రావత్.

బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఈ విధ్వంసానికి వేదికైంది. శనివారం నాగాల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ యువ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ డబుల్ సెంచరీతో చెలరేగింది. అంతేకాకుండా ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చేసింది. ఎదుర్కొన్న 150 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లతో 242 పరుగులు చేసింది. ఈ విధ్వంసం మాత్రమే కాకుండా.. లిస్ట్ ఏ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్ గా శ్వేతా సెహ్రావత్ చరిత్ర సృష్టించింది. అలాగే మూడు ఫార్మాట్లలో అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్ గా కూడా శ్వేతా రికార్డుల కెక్కింది.

who is shweta sehrawat

ఎవరీ శ్వేతా సెహ్రావత్?:

శ్వేతా సెహ్రావత్ డొమెస్టిక్ క్రికెట్ లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఛాంపియన్స్ గా నిలవడంలో వైస్ కెప్టెన్ గా శ్వేతా సెహ్రావత్ అద్భుతమైన కృషి చేసింది. అలాగే టాప్ స్కోరర్ గా కూడా శ్వేతా నిలిచింది. కానీ, శ్వేతా సెహ్రావత్ ఉమెన్ ఐపీఎల్ లో మాత్రం నిరాశపరిచింది. 2023లో రూ.40 లక్షలకు శ్వేతాని యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. కానీ, 6 మ్యాచుల్లో శ్వేతా కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది.

నాగాల్యాండ్ తో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. శ్వేతా సెహ్రావత్ ఈ మ్యాచ్ లో కేవలం 89 బంతుల్లోనే 101 పరుగులు బాదింది. ఆ తర్వాత మరింత విజృంభించి 150 బంతుల్లోనే 242 పరుగులు చేసింది. శ్వేతా సెహ్రావత్ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఢిల్లీ జ్టు ఏకంగా 4 వికెట్ల నష్టానికి 455 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన నాగాలాండ్ జట్టు ఈ భారీ స్కోర్ ఛేదించడంలో తడబడింది. కేవలం 55 పరుగులకే నాగాలాండ్ బ్యాటర్లు ఆలౌట్ అయ్యారు.