iDreamPost
android-app
ios-app

Shubman Gill: శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీమిండియా దిగ్గజం!

  • Published Dec 30, 2023 | 3:53 PM Updated Updated Dec 31, 2023 | 12:25 PM

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌, ఫ్యూచర్‌ కోహ్లీగా చెప్పుకుంటున్న శుబ్‌మన్‌ గిల్‌ గురించి టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గిల్‌ చేస్తున్న పొరపాటు అదే అంటూ, దాని వల్లే అతను దెబ్బ తింటున్నాడంటూ పేర్కొన్నాడు. మరి గవాస్కర్‌ గురించిన ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌, ఫ్యూచర్‌ కోహ్లీగా చెప్పుకుంటున్న శుబ్‌మన్‌ గిల్‌ గురించి టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గిల్‌ చేస్తున్న పొరపాటు అదే అంటూ, దాని వల్లే అతను దెబ్బ తింటున్నాడంటూ పేర్కొన్నాడు. మరి గవాస్కర్‌ గురించిన ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 30, 2023 | 3:53 PMUpdated Dec 31, 2023 | 12:25 PM
Shubman Gill: శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీమిండియా దిగ్గజం!

టీమిండియా యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన క్రికెటర్‌. భారత జట్టుకు మరో కోహ్లీ అవుతాడని క్రికెట్‌ అభిమానులు చాలా త్వరగా నమ్మకం పెట్టుకున్న ఆటగాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సంచలన బ్యాటింగ్‌తో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు గిల్‌. భవిష్యత్తులో ఇండియన్‌ క్రికెట్‌కు అసలు ఏ మాత్రం ఢోకా లేదని అభిమానులు గుండెలపై చేయి వేసుకుని ధీమాగా ఉండేలా చేశాడు తన బ్యాటింగ్‌తో. కానీ, ప్రస్తుతం గిల్‌ ఆడుతున్న తీరు క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరల్డ్‌ కప్‌లో పర్వాలేదనిపించిన శుబ్‌మన్‌ గిల్‌.. వరల్డ్‌ కప్‌ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గిల్‌ విఫలం అయ్యాడు. వన్డే సిరీస్‌లోనూ పెద్దగా రాణించలేదు.

దీంతో.. గిల్‌ ప్రస్తుత ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీమ్‌లో ఎదుగుతున్న క్రమంలో ఫామ్‌లో కోల్పోవడం కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులోనూ శుబ్‌మన్‌ గిల్‌ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ.. శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ స్టైల్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. శుబ్‌మన్‌ గిల్‌ చేస్తున్న పొరపాటు ఇదే అంటూ.. ఒక పాయింట్‌ను ఆయన హైలెట్‌ చేస్తూ వ్యాఖ్యానించారు. గిల్‌ జనరల్‌గా మరీ అంత అగ్రెసివ్‌ ప్లేయర్‌ కాదు, అలా అని మరీ జిడ్డుగా కూడా ఆడడు. టీ20ల్లో అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు ఉన్నా.. వన్డే, టెస్ట్‌ క్రికెట్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తాడు.

That's what Gill is doing wrong!

ఇప్పుడు సునీల్‌ గవాస్కర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. శుబ్‌మన్‌ గిల్‌ తన నాచ్యురల్‌ గేమ్‌ కాకుండా.. కాస్త ఓవర్‌ అగ్రెసివ్‌గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని, అక్కడే గిల్‌ దెబ్బతింటున్నాడంటూ గవాస్కర్‌ చెబుతున్నారు. ఒక లెజెండరీ క్రికెటర్‌గా గవాస్కర్‌కు ఎంతో అనుభవం ఉంది, పైగా కామెంటేటర్‌గా కూడా నిత్యం ఆటగాళ్ల బ్యాటింగ్‌ శైలిని చాలా కీన్‌గా అబ్జ్వర్‌ చేస్తుంటారు. సో అంతటి గ్రేట్‌ క్రికెటర్‌ గిల్‌ గురించి ఒక మైనస్‌ పాయింట్‌ లెవనెత్తారంటే.. గిల్‌ కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే అవుట్‌ అయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్‌పై 26 పరుగుల మంచి స్టార్ట్‌ లభించినా.. గిల్‌ దాన్ని పెద్ద స్కోర్‌గా మల్చలేకపోయాడు. వేగంగా ఆడాలనే అతని తపన వికెట్‌ కోల్పోవడానికి కారణమైంది. మరి గిల్‌ ఓవర్‌ అగ్రెసివ్‌గా ఆడే క్రమంలో దెబ్బతింటున్నాడన్న గవాస్కర్‌ వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.