iDreamPost
android-app
ios-app

యోయో టెస్ట్‌లో కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్‌ చేసిన గిల్‌!

  • Published Aug 26, 2023 | 9:09 AM Updated Updated Aug 26, 2023 | 11:08 AM
  • Published Aug 26, 2023 | 9:09 AMUpdated Aug 26, 2023 | 11:08 AM
యోయో టెస్ట్‌లో కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్‌ చేసిన గిల్‌!

ప్రస్తుతం ఉన్న భారత క్రికెట్‌ జట్టులో విరాట్‌ కోహ్లీ అందరి కంటే ఫిట్‌గా ఉంటాడని అంతా అనుకుంటారు. దాదాపు 15 ఏళ్ల నుంచి కోహ్లీ ఒక్కసారి కూడా గాయంతో జట్టు దూరం కాలేదంటే.. ఎవరైనా అంత అనుకుంటారు. కానీ, టీమిండియాలో కోహ్లీని మించిన ఫిట్‌నెస్‌తో ఓ క్రికెటర్‌ ఉన్నాడు. అతనెవరో కాదు యువ సంచలనం శుబ్‌మన్‌ గిల్‌. టీమిండియాకు మరో కోహ్లీగా పేరుతెచ్చుకున్న గిల్‌.. ఆసియా కప్‌ 2023కు ముందు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్ట్‌ యోయో టెస్ట్‌లో ఇప్పటి వరకు యోయో టెస్ట్‌లో పాల్గొన్న వారికంటే అత్యధిక పాయింట్లు సాధించాడు.

దీంతో టీమిండియాలో అందరి కంటే ఎక్కువ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. అందరి కంటే ముందు యోయో టెస్ట్‌లో పాల్గొన్న విరాట్‌ కోహ్లీ.. తాను యోయో టెస్ట్‌లో పాస్‌ అయినట్లు, ఈ టెస్ట్‌లో 17.2 స్కోర్‌ చేసినట్లు కోహ్లీ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. 20 పాయింట్లకు 17.2 అంటే ఇక ఈ స్కోర్‌ను దాటడం టీమిండియాలో మరో ఆటగాడికి సాధ్యం కాదని అంతా భావించారు. కోహ్లీ తర్వాత.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సైతం యోయో టెస్ట్‌కు హాజరయ్యారు. వాళ్లిద్దరూ కూడా టెస్ట్‌లో పాసైనా.. ఎంత స్కోర్‌ చేసింది తెలియలేదు.

అయితే.. తాజాగా శుబ్‌మన్‌ గిల్‌ యోయో టెస్ట్‌లో ఏకంగా 18.7 స్కోర్‌ చేసినట్లు సమాచారం. ఈ స్కోర్‌తో 17.2 స్కోర్‌ చేసిన కోహ్లీ, గిల్‌ కంటే వెనుకబడిపోయాడు. అయితే.. కోహ్లీ తన యోయో టెస్ట్‌ స్కోర్‌ను సోషల్‌ మీడియాలో పెట్టిన తర్వాత.. ఇంకెవరూ తమ యోయో టెస్ట్‌ స్కోర్‌ను సోషల్‌ మీడియాలో పెట్టకూడదని, దాన్ని రహస్యంగా ఉంచాలని బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు వార్నింగ్‌ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినా కూడా గిల్‌ యోయో టెస్ట్‌ స్కోర్‌ బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ యోయో టెస్ట్‌ స్కోర్‌తో టీమిండియాలో మోస్ట్‌ ఫిట్‌ ప్లేయర్‌గా కోహ్లీ స్థానాన్ని గిల్‌ లాక్కున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యువరాజ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారంటే?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom